పవన్ ను చూసి స్ఫూర్తి పొందే సినిమాలు ఏం చేశాడబ్బా?

పవన్ ను చూసి స్ఫూర్తి పొందే సినిమాలు ఏం చేశాడబ్బా?

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉన్నప్పటికి తన అభిమాని నితిన్ సినిమా ఆడియో వేడుకకి హాజరయ్యాడు. పవన్ కళ్యాణ్ నిన్నటి ‘చల్ మోహన్ రంగ’ ఆడియో వేడుకలో చేసిన ఒక వ్యాఖ్య అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సినిమాల్లో విజయాలు పరాజయాలతో సంబంధం లేకుండా తాను సాగిపోతుంటానని.. నితిన్ కూడా అదే తరహా అని అన్న పవన్ కళ్యాణ్.. తనను చూసి.. తన సినిమాలు చూసి ఇన్ స్పైర్ అయి కొందరు ఐఐటీల స్థాయికి వెళ్లారన్నట్లుగా మాట్లాడాడు. ఐతే పవన్ అంతగా యువతను ఇన్ స్పైర్ చేసే సినిమాలు ఏం చేశాడబ్బా అన్న సందేహాలు కలుగుతున్నాయి ప్రేక్షకులకు. కెరీర్ ఆరంభం నుంచి పవన్ లవ్ మరియు కమర్షియల్ సినిమాలే ఎక్కువగా చేశాడు. పవన్ ఎప్పుడు సందేశాత్మక చిత్రాలు చేసింది లేదు. మరి పవన్ సినిమాలు చూసి ఎవరు ఇన్ స్పైర్  అయ్యారో.. ఐఐటీల వరకు ఎలా వెళ్లిపోయారన్నది అంతుపట్టని విషయం. 

ఎవరైనా అభిమానులు అత్యుత్సాహంతో మేం మీ నుంచి.. మీ సినిమాల నుంచి స్ఫూర్తి పొందామని.. ఐఐటీల వరకు వెళ్లామని అని ఉంటే ఉండొచ్చేమో. పవన్ విని ఊరుకోవాల్సింది కానీ.. ఆ మాటను తీసుకొచ్చి ఇలా సినిమా వేడుకలో చెప్పడం వినడానికి ఏమంత బాగా అనిపించడం లేదు. అయినా పవన్ ఎప్పుడూ తన గురించి ఇలా చెప్పుకోవడానికి ఇష్టపడడు. కానీ ఇన్నాళ్లూ నటుడిగా సింప్లిసిటీ ప్రదర్శించిన అతను.. రాజకీయ నాయకుడిగా మారాక మాత్రం తన గురించి ఎక్కువే చెప్పుకుంటున్నాడు. మొన్నటి జనసేన ప్లీనరీలోనూ పవన్ ప్రసంగం విన్న రాజకీయ విశ్లేషకులు  పవన్ తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారని అభిప్రాయపడ్డ సంగతి తెలిసేందే. ఆ క్రమంలోనే పవన్ తాజా వ్యాఖ్యలు చేశాడేమో.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos