ఆ సినిమా కథ ఓకే చేయడమే మా దరిద్రం : నితిన్

Nithin about akhil movie result
Highlights

ఏ ముహుర్తాన వివి వినాయక్ అఖిల్ సినిమా కథ విన్నామో కానీ అది మా దరిద్రం

నితిన్ ఛల్ మోహన రంగా రిలీజ్ అయ్యి వారం అయ్యింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సినిమా ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయింది. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తన అఖిల్ సినిమా గురించి చెప్పుకొచ్చాడు. ఏ ముహుర్తాన వివి వినాయక్ అఖిల్ సినిమా కథ విన్నామో కానీ అది నచ్చడమే తమ దరిద్రమని చెప్పుకొచ్చాడు. మేము ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది అసలు కథను జడ్జ్ చేయటం దగ్గరే ఫెయిల్ అయ్యాం అని తన మనసులోని బాధను బయటపెట్టాడు. అ సినిమా ఫలితం కూడా దానికి తగ్గట్టే వచ్చిందని చెప్పిన నితిన్ ఫ్యూచర్ లో మాత్రం అఖిల్ తో ఒక సూపర్ హిట్ సినిమా తీస్తాననే కాన్ఫిడెన్స్ వ్యక్తం చేసాడు. మొత్తానికి అఖిల్ జ్ఞాపకాలు చాలా చేదుగా ఇంకా వెంటాడుతూనే ఉన్నాయన్న మాట. 

loader