నటిని అసభ్యకరంగా తాకుతూ వేధిస్తున్న దర్శకుడు

First Published 9, Jul 2018, 12:59 PM IST
Nisha Sarang complaints about harassment
Highlights

సెట్ లో తనను ఎంతగానో వేధించేవాడని అందరి ముందే ఇష్టంవచ్చినట్లు ప్రవర్తించేవాడని నిషా సారంగ్ చెప్పింది. బూతు మెసేజ్ లు పంపించినా భరించానని.. కానీ 
కొన్ని రోజులకు అసభ్యకరంగా తాకుతూ నీచంగా ప్రవర్తించడంతో గట్టిగా హెచ్చరించినట్లు అయినా అతడి తీరు మారలేదని వెల్లడించింది

మలయాళంలో బుల్లితెర నటిగా గుర్తింపు పొందిన నిషా సారంగ్ ప్రస్తుతం 'ఉప్పం ములకుం' అనే సీరియల్ లో నటిస్తున్నారు. మలయాళంలో ఈ సీరియల్ కు చక్కటి ఆదరణ లభిస్తోంది. అయితే ఈ సీరియల్ ను డైరెక్ట్ చేస్తోన్న ఉన్నికృష్ణన్ తనను కొంతకాలంగా వేధిస్తున్నట్లు నిషా సారంగ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. సెట్ లో తనను ఎంతగానో వేధించేవాడని అందరి ముందే ఇష్టంవచ్చినట్లు ప్రవర్తించేవాడని చెప్పింది.

బూతు మెసేజ్ లు పంపించినా భరించానని.. కానీ కొన్ని రోజులకు అసభ్యకరంగా తాకుతూ నీచంగా ప్రవర్తించడంతో గట్టిగా హెచ్చరించినట్లు అయినా అతడి తీరు మారలేదని వెల్లడించింది. అవార్డు ఫంక్షన్ కోసం నిషా విదేశాలకు వెళ్లి వచ్చే గ్యాప్ లో సీరియల్ నుండి ఆమెను తొలగించడంతో అసోసియేషన్ లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తిరిగి ఆమెను సీరియల్ లోకి తీసుకున్నా.. అతడి వేధింపులు ఆగవని  అతడిపై చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తూనే ఉంటానని చెప్పుకొచ్చింది. ఆమెకు మద్దతుగా మమ్ముట్టి అలానే విమెన్ ఇన్ కలెక్టివ్ సభ్యులు నిలిచారు.  

loader