Asianet News TeluguAsianet News Telugu

'నిన్ను కోరి' థియేట్రికల్‌ ట్రైలర్‌కు 8 మిలియన్‌ వ్యూస్‌

  • నాని, నివేద థామస్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన నిన్ను కోరి చిత్రం
  • ఇటీవలే రిలీజైన ట్రైలర్ కు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పై విశేష స్పందన
  • ఇప్పటికే 8మిలియన్ వ్యూస్ దక్కించుకున్న డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ నిన్ను కోరి ట్రైలర్
ninnukori trailer getting tremendous response on digital platforms

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి పతాకంపై శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న చిత్రం 'నిన్నుకోరి'. ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్‌కు అన్నిచోట్ల నుంచి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఇప్పటివరకు ఈ ట్రైలర్‌కు 8 మిలియన్‌ డిజిటల్‌ వ్యూస్‌ వచ్చాయి. ట్రైలర్‌లోని డైలాగ్స్‌, పాటలు, ఫోటోగ్రఫీ అన్నీ ఎక్స్‌ట్రార్డినరీగా వున్నాయని, హీరో నాని, హీరోయిన్‌ నివేదా థామస్‌, ముఖ్యపాత్ర పోషిస్తున్న ఆది పినిశెట్టి.. ఇలా ట్రైలర్‌లో కనిపించిన ప్రతి ఒక్కరి డైలాగ్స్‌ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. కోన వెంకట్‌ డైలాగ్స్‌ ఈ చిత్రానికి ఓస్పెషల్‌ ఎస్సెట్‌గా చెప్పొచ్చు.

 

ఈ చిత్రానికి గోపీసుందర్‌ ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ అందించారు. నిర్మాత దానయ్య డి.వి.వి. ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా సినిమాని చాలా రిచ్‌గా నిర్మించారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయమవుతున్న శివ నిర్వాణ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడని యూనిట్‌ మెంబర్స్‌ ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలై 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను జూన్‌ 29న చాలా గ్రాండ్‌గా చేయబోతున్నారు. 


నేచురల్‌ స్టార్‌ నాని, నివేథా థామస్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రని ఆది పినిశెట్టి పోషిస్తున్నారు. మురళీశర్మ, తనికెళ్ళ భరణి, పృథ్వీ, రాజశ్రీనాయర్‌, నీతు, భూపాల్‌రాజ్‌, కేదార్‌శంకర్‌, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్‌ నేహంత్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 


ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్‌, సంగీతం: గోపీసుందర్‌, ఫోటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని, ఆర్ట్‌: చిన్నా, స్టైలింగ్‌: నీరజ కోన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీజో, కో-డైరెక్టర్‌: లక్ష్మణ్‌ ముసులూరి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సత్యం గుగ్గిల, నిర్మాత: దానయ్య డి.వి.వి., కథ, దర్శకత్వం: శివ నిర్వాణ. 

 

Follow Us:
Download App:
  • android
  • ios