Asianet News TeluguAsianet News Telugu

"నిన్నుకోరి" మూవీ రివ్యూ.. ఇదోరకం ప్రేమ సంఘర్షణ

 • చిత్రం : నిన్నుకోరి
 • తారాగణం : నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్, మురళీ శర్మ, పృథ్వీ
 • సంగీతం : గోపి సుందర్
 • దర్శకత్వం : శివ నిర్వాణ
 • నిర్మాత : డివివి దానయ్య
 • ఆసియానెట్ రేటింగ్-2.5/5
NINNU KORI MOVIE REVIEW NANI NIVEDA CAST
 • Facebook
 • Twitter
 • Whatsapp

కథ :
ఉమా మహేశ్వరరావు (నాని), వైజాగ్ ఆంధ్రయూనివర్సిటీలో పి.హెచ్.డీ చేసే అనాథ కుర్రాడు. ప్రొఫెసర్ మూర్తి సాయంతో చదువుకునే ఉమా.. గీతమ్స్ కాలేజ్ లో చదువుకునే పల్లవి(నివేదా థామస్) తో ప్రేమలో పడతాడు. పల్లవి ఇంట్లోనే పెంట్ హౌస్ లో అద్దెకు దిగుతాడు. కెరీర్‌ కోసం ఢిల్లీ వెళ్ళానుకున్న సమయంలో లేచిపోదామని నానిని ఒత్తిడి చేస్తుంది పల్లవి. ఆమె తండ్రి తత్త్వం తెలిసి తాను ఢిల్లీ వెళ్లొచ్చి సెటిలయ్యాకే పెళ్లి చేసుకుంటానంటాడు. పల్లవి తండ్రి(మురళీ శర్మ) జీవితంలో సెటిల్ అవ్వని వాళ్లకు ఏ తండ్రీ తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడు అని చెప్పిన మాటలతో.. ఎలాగైన జీవితంలో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుందామని పల్లవిని ఓప్పించే ప్రయత్నం చేస్తాడు. తన కెరీర్ లో సెటిలవడం కోసం ఉమా పిహెచ్డీ చదువుకు ఢిల్లీ వెళ్లిపోతాడు. అనంతరం పల్లవి తన పేరెంట్స్ చూసిన అరుణ్ (ఆది పినిశెట్టి)ని పెళ్లి చేసుకొని ఫారిన్ లో సెటిల్ అవుతుంది.

ఏడాది తర్వాత తిరిగి వచ్చిన నానికి విషయం తెలిసి.. దేవదాసులా మారతాడు. విషయం గ్రహించిన నాని గురువు భరణి.. నానికి లండన్‌లో ఓ ఉద్యోగం వచ్చేలా చేస్తాడు. ఈ విషయాన్ని పల్లవికి చెబుతాడు. ఆ తర్వాత ఆమె నానిని కలుస్తుంది. అంతా మరిచిపోయి హాయిగా జీవిస్తున్న పల్లవి జీవితంలోకి ఉమా ఎలా తిరిగొచ్చాడు..? పల్లవి దూరమయ్యాక ఉమా ఏమయ్యాడు..? ఉమాని తిరిగి కలిశాక పల్లవి అరుణ్‑కు దూరమైందా..? లేక ఉమానే పల్లవికి దూరమయ్యాడా...? అన్నదే మిగతా కథ. 

విశ్లేషణ :

ఓ ప్రేమికుడు.. పెళ్ళయిన తన ప్రేయసి సుఖంగా వుందా! లేదా! అనేది తెలియాలంటే పదిరోజులు ఆమె ఇంట్లో వుంటే సరిపోతుందనే కాన్సెప్ట్‌ ను దర్శకుడు శివ ఎంచుకున్నాడు. ఇలాంటి కథలో పాత్రల మధ్య జరిగేస సంఘర్షణ ఇలానే వుండాలని అనిపించినా అది జడ్జ్ చేయడం కష్టం. అందునా ఈ కథ ఎక్కువగా విదేశాల్లో జరుగుతుంది. విదేశాల్లో మైండ్ సెట్ కు, లోకల్ మైండ్ సెట్ కు మధ్య సంఘర్షణ కూడా వేరు. మొదటి భాగంలో కొంత వైజాగ్‌లో హీరోహారోయిన్ల లవ్‌ ట్రాక్‌ నడిపి ఆ తర్వాత విదేశాల్లోకి వెళుతుంది. పిల్ల తండ్రిగా మురళీశర్మ పడే తపన ప్రతి తెలుగువాడు పడేదే. అయితే తన కూతుర్ని విదేశాలకు పంపాక అక్కడ విచిత్రంగా అనిపిస్తుంది. అక్కడ కల్చర్‌ అంతా రివర్స్‌. 

ఇలా తెలుగు సంస్కృతి సంప్రదాయాలను మరిచి పాశ్చాత్య కల్చర్‌ ఎలా కొనసాగుతుందో చూపించాడు. ఇదంతా అక్కడి వారికి బాగానే వుంటుంది. కానీ ఇప్పటికే పాశ్చాత్య కల్చర్‌ మనవారిని పాడుచేస్తున్న తరుణంలో.. సినిమా పరంగా నిన్నుకోరి మరో ముందడుగు వేసిందనడంలో సందేహమే లేదు. ఏది ఏమైనా.. చిత్రంలో ఏడాదిపాటు ప్రేమించిన పల్లవి... తాను పెండ్లి చేసుకుంటున్నాననే విషయాన్ని నానికి ఆ తర్వాత కూడా చెప్పకపోవడం చిత్రమే. పదిరోజుల పాటు తన ఇంట్లో ఉండమని ఆహ్వానించడం చిత్రంగా అనిపిస్తుంది. దీనికి ఆమె భర్త ఆది కూడా.. అంగీకరిస్తాడు. సినిమాని సినిమాలాగా చూడాలి కానీ.. అనే కౌంటర్ ఇవ్వచ్చనే ధీమాతో ఇలా కానిచ్చేశారు. అయితే చివర్లో ఆది.. తాను ప్రేమించిన జెన్నీ అనే అమ్మాయి.. ఆత్మహత్య చేసుకుందనీ.. అలా నువ్వు చేసుకోకూడదనే నిన్ను ఇంటికి రమ్మన్నానని ఆది.. నానితో చెప్పడం చూస్తే.. అన్నిటికన్నా మిన్నగా ప్రాణం విలువను గుర్తించే ఆది కేరక్టర్... ప్రేమించిన అమ్మాయిల మొగుళ్లంతా ప్రాణాలను గౌరవిస్తే.. మాట్లాడుకుని కాంప్రమైజ్ చేసుకుంటే.. ఓ అండస్టాండింగ్ కు వస్తే... అసలు హింస అనే పదమే వుండదేమో అనిపిస్తుంది.

మొత్తానికి రకరకాల సన్నివేశాలు కలిపి..  ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కాదు.. పెండ్లయ్యాక కూడా వేరే పార్ట్ నర్ వున్నా మళ్లీ ప్రేమించుకోవచ్చని చాలా గొప్ప నీతిని బోధించారు. ఇది తెలుగువారి సంస్కృతీ,సంప్రదాయాలను పక్కనబెట్టి ఒళ్లు బలిసి కొట్టుకునే వారి కోసం తీసిన సినిమాలా అనిపిస్తుంది.

నటీనటులు :

నేచురల్ స్టార్ నాని నటుడిగా మరోసారి తన స్థాయిని ప్రూవ్ చేసుకున్నాడు. తన స్టైల్ అల్లరి సీన్స్ గిలిగింతలు పెట్టిన నాని, చాలా సీన్స్ లో ప్రేక్షకులతో కంటతడి పెట్టించాడు. విలన్ లేని సినిమాలో అక్కడక్కడే తానే విలన్ బాధ్యత తీసుకొని కథను ముందుకు నడిపించాడు. మరో హీరో ఆది ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. తక్కువ మాటలతో సెటిల్ ఫర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో ఆది నటన సూపర్బ్. హీరోగా నివేదా బెస్ట్ చాయిస్ అనిపించుకుంది. ఇప్పటికే జెంటిల్‑మేన్ సినిమాతో నానికి జోడిగా నటించిన నివేదా మరోసారి మంచి కెమిస్ట్రీతో అలరించింది. ఫస్ట్ హాఫ్ లో అల్లరి అమ్మాయిగా కనిపించిన నివేదా, సెకండ్ హాఫ్ లో హుందాగా కనిపించి మెప్పించింది. ఎమోషనల్ సీన్స్ లో నివేదా నటన ప్రతీ ఒక్కరి గుండె బరువెక్కిస్తుంది. తండ్రి పాత్రలో మురళి శర్మ మరోసారి ఆకట్టుకోగా, తనికెళ్ల భరణి, పృథ్వి తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణులు :
తొలి సినిమాతో దర్శకుడు శివ నిర్వాణ అందరి దృష్టిని ఆకర్షించాడు. కథా ,కథనాలను అతను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. రెగ్యులర్ ట్రయాంగులర్ లవ్ స్టోరిని మూడు గంటలపాటు కదల కుండా కూర్చో బెట్టే ఎమోషనల్ జర్నీగా మార్చటంలో శివ సక్సెస్ సాధించాడు. సినిమా అంతా ఎంతో జాగ్రత్తగా నడిపించిన దర్శకుడు క్లైమాక్స్ మాత్రం హడావిడిగా ముగించినట్టుగా అనిపించింది. కాకుంటే కథ మన కల్చర్ కు పూర్తి విరుద్ధంగా వుండటం ఆలోచించాల్సిన అంశం. ఈ సినిమాకు సహ నిర్మాతగాను వ్యవహరించిన కోన వెంకట్ అందించిన స్క్రీన్ ప్లే సినిమా స్థాయిని పెంచింది. దర్శకుడు శివతో కలిసి కోన అందించిన మాటలు సినిమాకు మరో ఎసెట్. సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫి, వైజాగ్ అందాలతో పాటు ఫారిన్ లోకేషన్స్ ను అద్భుతంగా చూపించాడు కార్తీక్. గోపిసుందర్ సంగీతం ప్రతీ సీన్‑లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యే చేసింది. సంగీతపరంగా శేఖర్‌ చంద్ర బాణీలు పర్వాలేదు. కానీ రీరికార్డింగ్‌ మరీ దారుణంగా వుంది. ప్రతి సీన్‌కు బ్యాక్‌గ్రౌడ్‌ డిస్టబ్‌గా వుంది. కెమెరా పనితనం ఓకే.

ప్లస్ పాయింట్స్ :
నాని, ఆది, నివేదా నటన
ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్ :
క్లైమాక్స్ కథను పూర్తిగా జస్టిపై చేసేలా లేకపోవడం

Follow Us:
Download App:
 • android
 • ios