ఆ యదవల మాటలకు స్పందించవద్దు

తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్‌పై గళమెత్తిన శ్రీరెడ్డి గత కొద్ది రోజులుగా పరిశ్రమపై, కొంత మంది ప్రముఖలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ‘అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలి’ అని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కూడా జుగుప్సాకరమైన వ్యాఖ్య చేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తిట్టిపోస్తున్నారు. బుధవారం రాత్రి ఆమె వాహనాన్ని వెంబడించారు కూడా. అయితే నిఖిల్ కూడా పవన్ అభిమాని అని తెలిసిందే. అందుకే పరోక్షంగా పవన్ అభిమానులను స్పందించొద్దని, శ్రీరెడ్డికి ఎక్కువ ప్రచారం కల్పించొద్దని సూచించారు.