కోలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న కొణిదెల నీహారిక విజయ్ సేతుపతి సరసన నచింటనున్న నీహారిక మెగా కూతురే అయినా కోలీవుడ్ దారిపట్టిన నీహారిక
నీహారిక కొణిదెల వారి గారాల పుత్రికే అయినా... వెండితెరపై వెలిగేందుకు మెగా అండ సరిపోవడంలేదు. మెగా వారసురాలిగా ఒక మనసు చిత్రంతో శ్రీ విష్ణు సరసన వెండి తెరంగేట్రం చేసిన నిహారిక ఆ సినిమా ఇచ్చిన లెసన్ నేర్చుకుంటున్న సమయం. ఆమెకు ఇంకా ఆఫర్లు రావడం లేదు. ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమలో ఆరణాల అచ్చ తెలుగు అమ్మాయిలను ఆదరించడం అరుదు. అందునా మెగా ఫ్యామిలీ కుమార్తె కావడంతో ఎలాంటి గ్లామర్ పర్ఫామ్ చేసేందుకు స్కోప్ ఉండదు. దీంతో దర్శకనిర్మాతలు ఆచి తూచి ఆలోచించి ఆమెను ప్రిఫర్ చేసేందుకు వెనకాడుతున్నారు.
మెగా అండ ఉన్నా తెలుగు దర్శక నిర్మాతలు ఆఫర్లు ఇవ్వకపోవడంతో నిహారిక కన్ను తమిళ ఇండస్ట్రీ వైపు పడింది. తమిళ హీరో విజయ్ సేతుపతి సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైన నిహారిక ఈ ఛాన్స్ వచ్చినందుకు హ్యాపీగా వుంది. తెలుగు చిత్ర పరిశ్రమ తెలుగు హీరోయిన్లని అంతగా ఆదరించక పోవడంతో.. గత ఇరవయ్యేళ్లలో పరిచయమైన తెలుగు హీరోయిన్లలో చాలా మంది ఇక్కడ అవకాశాలు లేక పక్క రాష్ట్రానికి వెళ్లిపోయారు.
అంజలి లాంటి హీరోయిన్లు తమిళ చిత్ర సీమలో సత్తా చాటాకే మళ్లీ తెలుగులోకి తిరిగొచ్చారు. మెగాస్టార్ ఫ్యామిలీ అండ వున్నప్పటికీ నాగబాబు కూతురు నిహారిక కూడా పక్క రాష్ట్రానికి వలస వెళ్లక తప్పలేదు. మరి కోలీవుడ్లో సక్సెస్ అయిన తర్వాత నిహారికని మన వాళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారోననేది మిలియన్ డాలర్ ప్రశ్న. ఏమైనా అక్కడ నాలుగైదు చిత్రాలు చేసి సక్సెసై తిరిగొస్తే కానీ చెప్పలేం.
