నా ప్రేమకు అడ్డు.. నా ఫ్యామిలీనే.!

First Published 25, May 2018, 10:12 AM IST
Niharika Konidela says that no one proposed me till now
Highlights

నా ప్రేమకు అడ్డు.. నా ఫ్యామిలీనే.!

మెగా ఫ్యామిలీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వాళ్లు ఆల్ మోస్ట్ సక్సెస్. మెగా కుటుంబం నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తనకంటు ఒక ఇమేజ్ ను సంపాదించుకుంది నిహారిక. త‌న ప్రేమ‌కు మెగా ఫ్యామిలీనే అడ్డు అంటూ నిహారిక ఓ ఇంట‌ర్వ్యూలో త‌న మ‌న‌సులోని మాట చెప్పిందంటూ ఓ వార్త నెట్టింట్లో ట్రోల్ అవుతోంది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు ఆచితూచి సినిమాలు చేస్తోంది. తెలుగు తోపాటు త‌మిళంలో కూడా ఈ మెగా హీరోయిన్ సినిమాలు చేస్తోంది. మెగా ఫ్యామిలీ ప‌రువు తీయ‌కుండా సినిమాలు చేస్తాన‌ని ఇటీవ‌ల నిహారిక చెప్పుకొచ్చింది.

ఎవ‌రైనా త‌న‌కు ల‌వ్ ప్ర‌పోజ‌ల్ చేస్తే చూడాల‌ని ఉంద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు ఆ కోరిక తీర‌లేదంటూ చెప్పింది. నా కాలేజ్ డేస్ నుంచి చూస్తున్నా.. ల‌వ్ ప్ర‌పోజ‌ల్ కోసం.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ్వ‌రూ కూడా ఆ సాహసం చేయ‌లేదు. బ‌హుశా నా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ చూసి ఏమో ఎవ‌రూ నాకు ప్ర‌పోజ‌ల్ చేయ‌లేద‌ని చెప్పుకొచ్చింది కొణెద‌ల హీరోయిన్ నిహారిక‌.

loader