షాక్..! శ్రీరెడ్డి కి కేంద్రం నుండి ఊహించని మద్దతు

షాక్..! శ్రీరెడ్డి కి కేంద్రం నుండి ఊహించని మద్దతు

శ్రీరెడ్డి నెల రోజుల పోరాటానికి చాలా మద్దతు ఇస్తూనే ఉన్నా కొంత మంది ఆమెను ఇంకా తప్పుపడుతూనే ఉన్నారు. టాలీవుడ్ లోగుట్టును మెల్లమెల్లగా యయటపెడుతూ కొంతకాలంగా టాలీవుడ్ ప్రముఖలుకు నిద్ర లేకుండా చేస్తుంది. ఇటీవలే హైదరాబాద్ ఫిల్మిం ఛాంబర్ ముందు అర్ధనగ్నంగా నిలబడ్డ విషయం తెలిసిందే. ఈ సంఘటనతో ఉలిక్కిపడ్డ టాలీవుడ్ వెంటనే మా అసోసియేషన్ వారు ప్రెస్ మీట్ పెట్టి శ్రీరెడ్డి కి మెంబర్ షిప్ మరియు సినిమా అవకాశాలు కూడా ఇవ్వకూడదని తెలియచేశారు. దీంతో తనకు మద్దతుగా ఒక్కరు కూడా రాలేదని శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది.

అయితే శ్రీరెడ్డి పోరాటానికి ఊహించని మద్దతు లభించింది. శ్రీరెడ్డి ఆరోపణలను ఎన్‌హెచ్‌ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. సమస్య పరిష్కార యంత్రాంగం లేకపోవడం పెద్ద లోటు అని మానవ హక్కుల సంఘం అంటోంది. తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై… తెలంగాణ, కేంద్ర సమాచార ప్రసారశాఖకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు ఇష్యూ చేసింది. సినిమాల్లో నటించకుండా ఆంక్షలు విధించడం… శ్రీరెడ్డి హక్కులకు భంగం కలిగించడమేనని ఎన్‌హెచ్‌ఆర్సీ అభిప్రాయపడింది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos