జక్కన్న, చెర్రీ ఎన్టీఆర్ మూవీలో మరో హీరో.. ఎవరో తెలుసా?

new hero in rajamouli ramcharan ntr combination movie
Highlights

  • ట్విటర్ లో ఫోటో పబ్లిష్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చిన జక్కన్న
  • రామ్ చరణ్, ఎన్టీఆర్ తో భారీ బజట్ మూవీకి ప్లాన్ చేసిన రాజమౌళి
  • ఈ మూవీలో మరో కీ రోల్ కోసం హీరోను వెతుకుతున్న దర్శకధీరుడు

 

బాహుబలితో తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి తర్వాత రాజమౌళి నెక్స్ట్ ఏంటా అని అంతా ఆలోచిస్తున్న సమయంలో ఓ ఫోటోను ట్విటర్ లో అప్ లోడ్ చేసి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చాడు జక్కన్న. రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో కలిసి ఓ మల్టీస్టారర్‌ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటన వచ్చింది. దీని పై రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

 

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఒక్క ఫోటోతో హింట్ ఇచ్చి వదిలేసి... ఫ్యాన్స్‌కు పెద్ద పజిల్‌నే ఇచ్చారు జక్కన్న. ‌మూవీలో యంగ్ టైగర్, మెగా పవర్ స్టార్ క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయి... ఇద్దిరికీ సమానమైన ఇంపార్టెన్స్ ఉంటుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఫ్యాన్స్‌లో మొదలయ్యాయి. తర్వాత ఇద్దరు హీరోలు పోలీస్ పాత్రల్లో కనిపిస్తారని రూమర్స్ వచ్చాయి. మరో వైపు బాక్సర్లు గా నటిస్తున్నారన్న వార్త కూడా వ్యాపించింది. తాజాగా ఈ మూవీలో మాస్ మహారాజా రవితేజ విలన్‌గా చేస్తారంటూ మరో వార్త బయటకొచ్చింది.

 

విలన్‌ గురించి అలా న్యూస్ తెలిసిందే లేదో... మళ్లీ మరో స్టార్ హీరో కూడా మూవీలో నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. ఆ స్టార్ హీరో ఎవరో కాదు... అల్లు అర్జున్. రాజమౌళి మల్టీస్టారర్‌లో స్టైలిష్ స్టార్‌ కూడా ఓ క్యారెక్టర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకధీరుడు ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌తో కలిసి ఫోటో పెట్టినప్పటి నుంచి ఇలా రోజుకో న్యూస్ బయటకొస్తూనే ఉంది. కాని సినిమాకు సంబంధించి అఫిషియల్‌గా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. మరి రాజమౌళి ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో వేచి చూడాలంతే.

loader