మెగా క్యాంప్ నుంచి మరో హీరో?

new hero entry tollywood from mega compound
Highlights

  • మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో టాలీవుడ్ ఎంట్రీ
  • సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మెగా అల్లుడి ఫోటో
  • శ్రీజ భర్త కళ్యాణ్ కునిగంటి హీరోగా రానున్నాడని వార్తలు

మెగా ఫ్యామిలీ నుంచి మరో కళ్యాణ్ బాబు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడా.. అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. చిరంజీవి రెండో అల్లుడు కళ్యాణ్ బాబు రాకకు రంగం సిద్ధం అవుతోందా అని అనిపించే విధంగా పరిస్థితులు మారుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న  చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ ఫోటో తాజా న్యూస్ కు కారణం. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజను పెళ్లి చేసుకున్నతరువాత ఈ మెగా కుటుంబ అల్లుడు త్వరలో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడు అన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. 

 

దీనికి కొనసాగింపుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న ఈ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చిరంజీవి అల్లుడు కళ్యాణ్ ఇప్పట్లో సినిమా రంగంలోకి రాడు అని మెగా కాంపౌండ్ లీకులు ఇస్తూ ఉన్నా వాటితో సంబంధం లేకుండా కొంతమంది కళ్యాణ్ కు సంబంధించిన ఫోటో షూ ట్ కు సంబంధించిన ఈఫోటోను సోషల్ మీడియాలో కొందరు షేర్ చేయడంతో ఇప్పుడు ఈ హడావిడి మొదలైంది. 

 

మొన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజునాడు తన ఇద్దరి మామయ్యల మధ్య నుంచుని ఉన్న ఫోటోను షేర్ చేసిన కళ్యాణ్ కు సంబంధించి మరో ఫోటో మాత్రమే కాకుండా ఒక మాస్ హీరో స్థాయిలో లుక్ తో కెమెరాలకు పోజులు ఇస్తూ తీయించుకున్న ఈఫోటో వెనుక చాల ఎత్తుగడలే ఉన్నాయి అని అనిపిస్తోంది. ఇంతకీ ఈఫోటోలో కనిపిస్తున్న కళ్యాణ్ లుక్ కు గురించిన వాస్తవాల గురించి క్లారిటీ లేకపోయినా క్రికెట్ టీమ్ ను తలపిస్తున్న మెగా కుటుంబ హీరోల లిస్టులో ఏదో ఒకరోజు ఈ జూనియర్ కళ్యాణ్ చేరడం ఖాయం అని అనిపిస్తోంది. మొత్తానికి మరో కళ్యాణ్ బాబు మెగా క్యాంప్ హీరోల్లో చేరబోతున్నాడన్నమాట.

loader