శ్రీదేవితో పోలిక అవసరమా అనసూయ.. పైర్ అవుతున్న నెట్టిజన్లు

First Published 3, May 2018, 5:34 PM IST
Netizens fires on anasuya pic
Highlights

శ్రీదేవితో పోలిక అవసరమా అనసూయ..  పైర్ అవుతున్న నెట్టిజన్లు

పోల్చుకోడానికైనా కాస్త ఆలోచించాలి.. శ్రీదేవి అందం ఎక్కడా యాంకర్ అనసూయ అందం ఎక్కడా? అంటూ శ్రీదేవి అభిమానులకు సుర్రున కాలే ఫోటో ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది యాంకర్ అనసూయ. ఈ మధ్య ‘రంగస్థలం’ సినిమాలో ‘రంగమ్మత్త’గా ప్రేక్షకుల్ని అలరించిన జబర్దస్త్ యాంకర్ చిలపపచ్చ రంగు చీరకట్టుకుని శ్రీదేవిలా ఫీల్ అవుతూ ఓ ఫ్రేమ్‌లో శ్రీదేవిని.. మరో ఫ్రేమ్‌లో తనను ఊహించుకుంటూ ‘ఈరోజు తన జబర్దస్త్ షోలో తన ఇంట్రో సాంగ్‌ని అందాల నటి శ్రీదేవికి డెడికేట్ చేస్తున్నట్టు’ కామెంట్ చేసింది. సాంగ్ డెడికేట్ వరకూ ఒకే.. బట్ ఓ ఫ్రేమ్‌లో శ్రీదేవి.. మరో ఫ్రేమ్‌లో అనసూయ అంటే.. శ్రీదేవి అభిమానులు వీక్షించడం కాస్త ఇబ్బందే.

శ్రీదేవి సాంగ్స్ అంటే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది ‘అందమా.. అందుమా.. అందనంటే అందమా.. ప్రాణమున్న పైడిబొమ్మ.. పారిజాత పూలకొమ్మ.. పరవశాలు పంచవమ్మ.. పాల సంద్రమా..’ అంటూ ఆమె అందాన్ని పొగుడుతూ గోవిందా.. గోవిందా మూవీలో నాగ్ పాడిన పాటే గుర్తుకు వస్తుంది. ఈ సాంగ్‌లో ప్లైయిన్ శారీస్‌లో శ్రీదేవి అందచందాలను వర్ణించాలంటే కవులకు పెద్ద పరీక్షే. ముఖ్యంగా చిలకపచ్చ రంగు చీరలో ఆమె అందం.. పాలరాతి శిల్పమే అన్నట్టుగా ఉంటుంది. 

ఇప్పుడు ఇదే చీరను యాంకర్ అనసూయ కట్టుకుని శ్రీదేవి మాదిరి స్టెప్పులేస్తున్నా.. చూసి ఎంజాయ్ చేయండంటూ తన జబర్దస్త్‌ షోకు ప్రమోషన్స్ నిర్వహించేసింది. చేస్తే.. చేశావ్ కాని ‘రంగమ్మత్తా’.. కాస్త పోలికలు పోల్చుకునే ముందు ఆమెకు ఫ్యాన్స్ ఉంటారు వాళ్లు హర్ట్ అవుతారని ఆలోచించకపోతే ఎట్టాసెప్పు. సర్లే సాయంత్రం జబర్దస్త్ షోలు కలుద్దాం.. అందమా.. అందుమా.. అందనంటే అందమా.

 

loader