నీలో శ్రీదేవిని చూస్తున్నాం.. జాన్వీపై నెటిజన్ల కామెంట్

netizens comments on jhanvi kapoor's photo
Highlights

దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన నటి శ్రీదేవి బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటింది

దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన నటి శ్రీదేవి బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటింది. బోణీకపూర్ ను పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయిన శ్రీదేవి తన ఇద్దరి కూతుళ్ల కెరీర్ ను బాగా సెట్ చేయాలనుకుంది.

కానీ ఇంతలోనే ఆమె మరణించడం కుటుంబ సభ్యులతో పాటు అభిమానులందరికీ పెద్ద షాక్. తన పెద్ద కూతురు జాన్వీ నటించిన 'ధడక్' సినిమా చూడకుండానే శ్రీదేవి చనిపోయారనే బాధ ప్రతి ఒక్కరిలో ఉంది. శ్రీదేవిని అభిమానించినట్లుగానే తన కూతురు జాన్వీపై ప్రేమను కురిపిస్తున్నారు ఫ్యాన్స్. ధడక్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోన్న జాన్వీ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ ఫోటోను పోస్ట్ చేసింది.

ఈ ఫోటో చూసిన వారందరూ కూడా అచ్చం శ్రీదేవిలానే ఉన్నవంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు. నిజానికి ఈ ఫోటో అంత ప్రత్యేకమైనది కాకపోయినా.. శ్రీదేవి ఫీచర్స్  ఎక్కువగా కనిపిస్తుండడంతో శ్రీదేవిని గుర్తుచేసుకున్నారు.  నీ రూపంలో మీ అమ్మ ఎప్పటికీ బ్రతికే ఉంటుందని కొందరు కామెంట్ చేయగా, మీ కళ్లు చాలా ఎక్స్ ప్రెసివ్ గా ఉన్నాయి అచ్చం శ్రీదేవిలానే అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. జాన్వీ నటించిన 'ధడక్' సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on Jul 2, 2018 at 3:16am PDT

loader