తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 ఎట్టకేలకు మొదలైంది.మొత్తం 16 మంది కంటెస్టెంట్స్‌తో అత్యంత అట్టహాసంగా ఆదివారం రాత్రి మొదలైంది. కంటెస్టెంట్స్‌లో 13 మంది సెలెబ్రిటీలు వుండగా, ముగ్గురు సామాన్యులకు అవకాశం ఇచ్చారు ఈసారి. పోయినసారి బిగ్‌బాస్ కోసం పూణేలో సెట్ వేశారు.

 కానీ ఈసారి అంతదూరం వెళ్ళే ప్రసక్తి లేకుండా హైదరాబాద్‌‌లోని అన్నపూర్ణ సెవెన్ ఎక్కర్స్‌లో బిగ్‌బాస్ హౌస్ సెట్ వేయటం విశేషం. హీరో నాని హోస్ట్‌గా చాలా బాగా చేశాడు.హౌస్‌లోకి వెళ్లిన మొదటి సెలబ్రిటీ నేపథ్య గాయని గీతామాధురి కాగా, తర్వాత వరుసగా అమిత్ తివారీ, న్యూస్ ప్రెజెంటర్ దీప్తి, నటుడు తనీష్, ప్రముఖ హేతువాది బాబు గోగినేని, నటి భానుశ్రీ, రోల్ రైడా, సామ్రాట్ రెడ్డి, యాంకర్ శ్యామల, కిరీటి దామరాజు, దీప్తి సునయన, కౌశల్, తేజస్వీ, గణేశ్, సంజన అన్నె (మోడల్), నూతన్ నాయుడు ఉన్నారు. 

కాగా తొలిరోజే బిగ్‌బాస్ హౌస్‌లో వేడి రగులుకుంది. మోడల్ సంజన, నూతన్ నాయుడును హౌస్‌లోని జైల్లో పెట్టారు. దీనిపై సంజనా ఫైర్ అయింది. అంత మంది సెలబ్రిటీల్లోనూ సామాన్యులుగా వచ్చిన తమ పేర్లనే సూచిండం ఏంటని మండిపడింది.

ఇదిలా వుండగా సీజన్ 2 బిగ్‌బాస్ షోలో ఒక్క రోల్ రైడాను మినహాయిస్తే అందరూ ఆంధ్రావాళ్ళే వున్నారు.. ఇది పక్కా ఆంధ్రా షో అనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. పోయినసారి సీజన్‌లో తెలంగాణ, ఆంధ్రవాళ్ళకి సమాన అవకాశం కల్పించారు. కానీ ఈసారి అలా కాకుండా అందరికందరినీ ఆంధ్రావాళ్ళనే ఎందుకు తీసుకున్నట్టో అనే విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం సామన్యుల లిస్టులో కూడా ఒక్కర్ని కూడా తెలంగాణ ప్రాంతం నుంచి తీసుకోకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.ఈ మేరకు నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్లు వేయడం గమనార్హం.