క్లాసికల్ సాంగ్స్ ని, సినిమాలను టచ్ చేయడానికి మేకర్స్ భయపడుతుంటారు. హీరోలు సైతం ఈ విషయంలో ఓ అడుగు వెనుకే ఉంటారు. ఏదైనా తేడా వస్తే నెటిజన్ల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వుంటుంది. అందుకే క్లాసిక్స్ జోలికి వెళ్లరు.

ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ కావడంతో జనాలు తమకు నచ్చని వాటి గురించి మొహం మీదే చెప్పేస్తున్నారు. తాజాగా యాంకర్ అనసూయను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. టీవీ షోలు, సినిమాలతో బిజీగా గడుపుతోన్న అనసూయ ఈ మధ్య ప్రకటనల్లో కూడా నటిస్తోంది. 

తాజాగా ప్రముఖ వస్త్రాల కంపనీ యాడ్ లో నటించింది. యాడ్ కోసం సదరు కంపనీ యాజమాన్యం 'మాయాబజార్' సినిమాలో ఆహనా పెళ్ళంట పాటను ఎన్నుకున్నారు. ఈ పాటలో అనసూయ మహానటి సావిత్రిని ఇమిటేట్ చేస్తూ నటించింది. దీంతో నెటిజన్లు అనసూయనే కాకుండా సదరు వస్త్రాల కంపనీ వారిపై కూడా మండిపడుతున్నారు.

సావిత్రి గారిని అవమానిస్తారా..? సావిత్రి గారితో నీకు పోలికేంటి అనసూయ? అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి పనులకి సావిత్రమ్మని వాడుకోకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి వీటిపై అనసూయ స్పందిస్తుందేమో చూడాలి!
 

వీడియో: సావిత్రి పాత్రలో జబర్దస్త్ అనసూయ!