జబర్దస్త్ షోతో యాంకర్ గా క్లిక్ అయిన  అనసూయ భరద్వాజ్ నటిగా కూడా తెగ బిజీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అందరిని ఆకర్షించిన ఈ అందాల బొమ్మ ఈ మధ్య యాడ్స్ తో కూడా సరికొత్తగా ఆకర్షిస్తోంది. 

ఏకంగా మహానటి సావిత్రి గెటప్ లో కనిపించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్రేట్ ఫిల్మ్ మాయాబజార్ సినిమాలోని ఆహా నా పెళ్ళంట సాంగ్ స్టైల్ లో చందాన బ్రదర్స్ కి సంబందించిన ప్రకటనలో మెరిసింది. సావిత్రి వేసిన స్టెప్పులను గుర్తు చేసిన ఆ అనసూయను చూసి నెటిజన్స్ కూడా పాజిటివ్ కామెంట్ చేస్తున్నారు. ఇక ఎస్వీఆర్ స్టైల్ లో సింగర్ మనో కనిపించి సరికొత్త లుక్ తెచ్చారు. 

ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఆ యాడ్ ట్రెండ్ అవుతోంది. అనసూయ ఇటీవల జబర్దస్త్ షోకి గుడ్ బాయ్ చెప్పినట్లు కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఇక సినిమాలతో అమ్మడు ఇప్పుడు బిజీగా మారింది.