పవన్ మీ పెళ్లికి వస్తారా..? రేణుదేశాయ్ ఏం చెప్పిందంటే!

netizen question to renudesai
Highlights

పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన రేణుదేశాయ్ ని పవన్ అభిమానులు ఇప్పటికీ వదిన వదినా అంటూ

పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన రేణుదేశాయ్ ని పవన్ అభిమానులు ఇప్పటికీ వదిన వదినా అంటూ పిలుస్తుంటారు. అటువంటిది ఆమె మరో పెళ్లి చేసుకోబోతుండడంతో కొందరు సహించలేకపోయారు. ఆమెకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపించారు.

దీంతో ట్విట్టర్ అకౌంట్ ను డిలీట్ చేసిన రేణు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు చేరువలో ఉంది. ఆమె పెళ్లి విషయం తెలిసినప్పటి నుండి నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆమెను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ మీ పెళ్లికి పవన్ అన్న వస్తాడా..? అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా ఆమె 'ఆయన కూడా సోషల్ మీడియాలో ఉన్నారు కదా ఆయన్నే అడగండి' అంటూ స్పందించారు.

అలానే మరో నెటిజన్ మీ పిల్లల గురించి బాధగా ఉందని అంటే.. మీ పిల్లలను సక్రమంగా చూసుకోమని చెబుతూ అకీరా, ఆద్యను జాగ్రత్తగా చూసుకోవడానికి చాలా మంది ఉన్నారని ఘాటుగా సమాధానమిచ్చింది. అలానే సెలబ్రిటీలు, రాజకీయనాయకుల గురించి వ్యక్తిగతంగా ఎక్కువ ఆలోచించకూడదని హితబోద చేసింది. 

loader