Asianet News TeluguAsianet News Telugu

ఇక "దువ్వాడ జగన్నాధం" థియేటర్లలో "నేనే రాజు నేనే మంత్రి" !!

  • రానా, కాజల్ జంటగా తెరకెక్కిన చిత్రం నేనే రాజు నేనే మంత్రి
  • తేజ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ డ్రామాలో మరో నటి కేథరిన్
  • ఈ చిత్రం ట్రైలర్ రేపు డీజే మూవీతోపాటు అన్ని థియేటర్స్ లో విడుదల

 

nene raju nene manthri trailer releasing with dj in duvvada jagannadham theatres

సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, బ్లూ ప్లానెట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "నేనే రాజు నేనే మంత్రి". సురేష్ బాబు-కిరణ్ రెడ్డి-భారత్ చౌదరిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. రాణా టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పోలిటికల్ థ్రిల్లర్ లో కాజల్, కేథరీన్ లు  కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ను జూన్ 23 శుక్రవారం విడుదల చేయనున్నారు. రేపు విడుదలవుతున్న అల్లు అర్జున్-పూజ హెగ్డేల "దువ్వాడ జగన్నాధం" చిత్రంతోపాటు "నేనే రాజు నేనే మంత్రి" ట్రైలర్ అన్ని థియేటర్లలో ప్రదర్శితం కానుంది. 1.22 నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ ఆడియన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ ను పెంచడంలో ముఖ్యపాత్ర పోషించనుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.   

 

చిత్ర దర్శకులు తేజ మాట్లాడుతూ.. "రాణాలోని సరికొత్త యాంగిల్ ను "నేనే రాజు నేనే మంత్రి"లో చూస్తారు. ప్రేక్షకులు ఊహించని విధంగా ఈ చిత్రంలో రాణా యాటిట్యూడ్ ఉంటుంది. జోగేంద్ర పాత్రలో రాణా ఒదిగిపోయిన విధానం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది" అన్నారు. 

 

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. "రాణా కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచే చిత్రం "నేనే రాజు నేనే మంత్రి". తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లోనూ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జూన్ 23 (శుక్రవారం) సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నాం. తేజ టేకింగ్ చాలా కొత్తగా ఉండబోతోంది. ప్రేక్షకులకు "నేనే రాజు నేనే మంత్రి" ట్రైలర్ చూశాక సినిమాపై మంచి అవగాహన వస్తుంది" అన్నారు.   

రానా, కాజ‌ల్, అశితోష్ రాణా, కేథ‌రిన్ థెరిస్సా, న‌వ‌దీప్‌, పోసాని, జెపీ, ర‌ఘు కారుమంచి, బిత్తిరి స‌త్తి, ప్ర‌భాస్ శీను, శివాజీ రాజా, జోష్ ర‌వి, న‌వీన్ నేలి, ఫ‌న్ బ‌కెట్ మ‌హేష్ త‌దిత‌రులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

 

నిర్మాణ సంస్థ:  సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, బ్లూ ప్లానెట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, సంగీతం:  అనూప్ రూబెన్స్‌, ఛాయాగ్ర‌హణం:  వెంక‌ట్ సి.దిలీప్‌, కూర్పు:  కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, క‌ళ‌:  నారాయ‌ణ రెడ్డి, పరుచూరి బ్రదర్స్-లక్ష్మీభూపాల్-సురేంద్ర కృష్ణ-శంకర్-రవివర్మ, నిర్మాత‌లు:  సురేష్ బాబు, కిర‌ణ్ రెడ్డి, భ‌ర‌త్ చౌద‌రి , ఎగ్జిక్యూటీవ్ నిర్మాత‌లు:  అభిరామ్ ద‌గ్గుబాటి, వివేక్ కూచిబొట్ల‌, స‌మ‌ర్ప‌ణ‌:  డి. రామానాయుడు, క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  తేజ‌

Follow Us:
Download App:
  • android
  • ios