ఆ బడా నిర్మాత కమిట్మెంట్ అడిగాడు: గోదావరి పిల్ల

neetu chandra on casting couch
Highlights

కాస్టింగ్ కౌచ్ మహమ్మారి తనకు ఛాన్సులు రాకుండా చేసింది

శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన 'గోదావరి' సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకుంది నటి నీతూచంద్ర. ఆ తరువాత సరైన అవకాశాలు అందుకోలేకపోయింది. దానికి కారణం ఆమె ముంబైలో ఉంటుందని అందుబాటులో ఉండదని రకరకాల వార్తలు వినిపించేవి. అయితే తనకు అవకాశాలు రాకపోవడానికి అసలు కారణం అది కాదని.. కాస్టింగ్ కౌచ్ మహమ్మారి తనకు ఛాన్సులు రాకుండా చేసిందని స్పష్టం చేసింది.

ఇటీవల తారలందరూ కూడా తాము ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ గురించి బహింగంగానే కామెంట్లు చేస్తున్నారు. నీతూ చంద్ర కూడా ఈ విషయంపై స్పందించింది. ఆఫర్లు చాలానే వచ్చినప్పటికీ.. కమిట్మెంట్ విషయంలో ముందుకు వెళ్లకపోవడంతో తనకు అవకాశాలు రాలేదని చెబుతోంది.

''2007లో 'ఓయ్ లక్కీ.. లక్కీ ఓయ్' సినిమా రిలీజ్ అయిన తరువాత ఓ టాప్ ఫిలిం మేకింగ్ కంపనీ నుండి ఫోన్ వచ్చింది. ఎన్నో ఆశలతో ఆఫీస్ కు వెళ్లగా.. ఆ నిర్మాత  నన్ను కమిట్మెంట్ అడిగాడు. అప్పటికి నా వయసు 23 సంవత్సరాలు. అతడు ఏం అడుగుతున్నాడో అర్ధం చేసుకోలేకపోయాను. అదే విషయాన్ని ఆయనకు చెప్పగా చాలా క్లియర్ గా తనకు ఏం కావాలో చెప్పుకొచ్చాడు. నేను అంగీకరించకపోవడంతో టాప్ బ్యానర్ లో నటించే ఛాన్స్ పోయింది. ఇలా చాలా చేదు అనుభవాలను ఎదుర్కొన్నాను. నాకు సరైన అవకాశాలు రాకపోవడానికి కారణం కూడా అదే'' అంటూ వెల్లడించింది. 
 

loader