Prema Entha Madhuram: మంచి ఆదరణతో ప్రేక్షకుల మన్నన పొందుతూ మంచి రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ ప్రేమ ఎంత మధురం. ఇక ఈ రోజు ఫిబ్రవరి 27 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
డాక్టరు పీక పట్టుకున్న అను సడన్ గా నార్మల్గా అయ్యి దేనికో భయపడుతుంది. అంతలో నిద్రలో నుంచి మెలకువ వచ్చిన పద్దు భయంతో కేకలు వేస్తుంది. ఆ కేకలకి నిద్రలేచిన సుబ్బు ఏం జరిగింది అంటూ ఆమె చేత మంచినీళ్లు తాగించి కలేమైన కన్నావా అని అడుగుతాడు. అవును సుబ్బు మన అమ్మికి అష్టమి పూట నొప్పులు వచ్చినట్లు తను దేనికో భయపడుతున్నట్లు కల వచ్చింది.
నాకు అర్జెంట్గా అమ్మని చూడాలని ఉంది ఇప్పుడే వెళ్దాం అంటుంది. తన గురించే మాట్లాడుకుంటూ పడుకున్నాం కదా అందుకే నీకు అలా అనిపించి ఉంటుంది ఇంత రాత్రిపూట వెళితే ఏం బాగుంటుంది అంటాడు సుబ్బు. నాకెందుకో కంగారుగా ఉంది ఇప్పుడే వెళ్దాం అంటుంది పద్దు. బుజ్జమని చూసి చాలా రోజులైంది కదా అందుకే అలా అనిపించి ఉంటుంది రేపు వెళ్దాంలే పడుకో అంటూ ఆమెకి పడుకోబెడతాడు సుబ్బు.
మరోవైపు కుడి కన్ను అదరటంతో భయపడుతుంది అను. కళ్ళు కదిరితే భయపడటం ఎందుకు అంటాడు ఆర్య. ఇప్పుడు కన్ను అదరడం గురించి పెద్ద క్లాస్ తీసుకుంటారు పెళ్లికి ముందే తీసుకున్నారు కదా గుర్తుంది అంటుంది. అయితే మనం ఒక గేమ్ ఆడదాము, ఇది కూడా ఐ కాంటాక్ట్ గేమ్ ఇద్దరమే ఒకరి కళ్ళలోకి ఒకరిని డీప్ గా చూసుకుందాము ఎవరు ముందుగా రెప్పలు వేస్తే వాళ్ళు ఓడిపోయినట్లు.
ఓడిపోయిన వాళ్ళు ఎదుటి వాళ్ళు చెప్పింది చేయాలి అంటాడు ఆర్య. ఆర్య ఎప్పటికీ కళ్ళు మూయకపోవటంతో అను అతనికి ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది. ఆ దెబ్బకి కన్ను మూసేస్తాడు ఆర్య. ఇది చీటింగ్ నువ్వు ముద్దు ఇవ్వటం వల్లే కళ్ళు మూసాను అంటాడు ఆర్య. నా మొగుడిని అలా చూసేసరికి నాకు ముద్దొచ్చేసాడు అందుకే ముద్దు ఇచ్చాను అంటుంది అను. గేమ్ లో ఈ రూల్ లేదు కదా అంటుంది అను.
నువ్వు డైవర్ట్ చేయకపోతే నేనే గెలిచేవాడిని అంటాడు ఆర్య. అదంతా నాకు తెలియదు మీరే ఓడిపోయారు అంటుంది అను. నేను ఒప్పుకోను అని భార్య అంటే నేను అలిగాను అంటుంది అను. సరేలే నేనే ఓడిపోయాను ఇప్పుడు ఏం చేయమంటావు అని ఆర్య అడిగితే నాకు అందంగా జడ వెయ్యండి అంటుంది అను. నేను జడ వెయ్యాలా అంటే అవును మీరే వెయ్యాలి ఫంటు ఆడియో చేత జడ వేయించుకుంటుంది అను. జడవేయటం రాక ఇబ్బంది పడుతుంటే అది చూసి నవ్వుతుంది అను.
ఏంటి నీకు నవ్వులాటగా ఉందా, కుదురుగా ఉండటం లేదు అంటాడు ఆర్య. నేను ఎలా వేయాలో చెప్తాను అలా ఫాలో అయిపోండి అంటుంది. మొత్తానికి అను ఇన్స్ట్రక్షన్ తో జడ వేయడం పూర్తి చేస్తాడు. అది చూసుకొని మా ఆయనకి నేనంటే ఎంత ప్రేమ అంటూ మురిసిపోతుంది అను. మరోవైపు కంగారుగా అనువాళ్ళ ఇంటికి వస్తారు పద్దు దంపతులు. వస్తూనే గట్టిగా కేకలు వేస్తూ వస్తున్న పద్ధుని ఏంటా గావు కేకలు ఇది ఇల్లు అనుకుంటున్నారా లేక మీ బస్తీ అనుకుంటున్నారా అంటుంది మాన్సీ.
సారీ అండి మేము మా బుజ్జమని చూసి పోదామని వచ్చాము ఆ ఆరాటంలో మా పద్దు కేకలు వేసింది అంటాడు సుబ్బు. వయసు పెరిగితే సరిపోదు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి అంటుంది మాన్సీ. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేటమేనా పెద్ద చిన్న చూసుకోవక్కర్లేదు అంటూ మందలిస్తుంది శారదమ్మ. డిస్టర్బ్ చేసింది వాళ్ళు అయితే మీరు నన్ను అంటున్నారు ఏంటి అంటుంది మాన్సీ. అప్పుడే అక్కడికి వచ్చిన నీరేజ్ మాన్సీ ని మందలించి వాళ్ళకి సారీ చెప్పు అంటాడు.
ఇంత చిన్న విషయానికి సారీ ఎందుకు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి అంటాడు సుబ్బు. లేనిపోని రాద్ధాంతాలు వద్దు మా అమ్మిని పిలిస్తే నాలుగు మాటలు మాట్లాడి వెళ్లిపోతాము అంటుంది పద్దు. అక్కడ అను దంపతులు కనిపించకపోవడంతో సార్ ఆఫీస్ కి వెళ్ళారా అని అడుగుతాడు సుబ్బు. అను, ఆర్య ఇంట్లో లేరు అని ఆర్య తల్లి చెప్తే ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది పద్దు.
శారదమ్మ ఏదో చెప్పేలోపు ట్రిప్ కి అని అబద్ధం చెప్పేస్తాడు నీరజ్. మీ సమాధానాల్లో పొంతన లేదేంటి, మీ మొహాల్లో ఆందోళన కనిపిస్తుంది ఏం జరిగింది అంటూ నిలదీస్తుంది పద్దు. దాదా, వదినమ్మ చిన్న చేంజ్ ఓవర్ కోసం అని నీరజ్ ఏదో చెప్తుండగా మీరు అబద్ధం చెబుతున్నారు. కిందటిసారి వచ్చినప్పుడు కూడా ఇలాగే ఏదో చెప్పారు. అప్పటినుంచి బుజ్జమ్మ ఆర్య సార్ ఫోన్లు పనిచేయట్లేదు. చూస్తుంటే మీరేదో దాస్తున్నారని అనిపిస్తుంది. మా బుజ్జమ్మ మాతో మాట్లాడకుండా ఎన్ని రోజులు ఎప్పుడూ లేదు అంటాడు సుబ్బు.
మాట్లాడండి మీరు మాట్లాడకపోతే నాకు వచ్చిన కల నిజమైనట్లుగా అనిపిస్తుంది అంటూ ఏడుస్తూ అడుగుతుంది పద్దు. ఏం కల అని శారదమ్మ అడిగితే అష్టమి ఘడియల్లో పురిటి నొప్పులు వచ్చినట్లు అప్పుడే రాజనందిని ఆత్మ బుజ్జమ్మకి ఆవహించినట్లు, వేడుకలు వచ్చాయి అదే భయంతో తెల్లారేసరికి పరిగెత్తుకుని వచ్చాము ఇలా చూస్తే వాళ్ళిద్దరూ కనిపించట్లేదు, మీరేమో ఏవేవో కథలు చెప్తున్నారు నాకు చాలా భయంగా ఉంది అంటూ ఏడుస్తుంది. నిజం చెప్పండి అంటూ శారదమ్మ కాళ్లు పట్టుకుంటుంది. దీన్నే ఓవరాక్షన్ అంటారు మీ అమ్మాయికి ఏమైపోయిందని మీ ఆరాటం ఏదో ఒక రోజు ఇక్కడికి వస్తుంది కదా అంటుంది మాన్సీ.
ఎంత తేలిగ్గా అలా మాట్లాడేసారు కనీసం ఆర్య సార్ కైనా ఫోన్ చేసి ఇవ్వండి అంటుంది పద్దు. ఏం జరిగిందో చెప్పండి నా బుజ్జమ్మ క్షేమంగానే ఉంది కదా అంటూ రిక్వెస్ట్ చేస్తాడు సుబ్బు. ఏమో ఎవరికి తెలుసు అంటుంది మాన్సీ. అంటే వాళ్ళు ఎక్కడున్నారో మీకు తెలియదా సుబ్బు వీళ్ళు మన దగ్గర ఏదో దాస్తున్నారు పద మనమే వెళ్లి బుజ్జమ్మ వాళ్ళని వెతుక్కుందాము అంటుంది పద్దు. శారదమ్మ ఎంత పిలిచినా వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు సుబ్బు దంపతులు. దిగులుగా కూర్చున్న తల్లి దగ్గరికి వస్తాడు నీరజ్.
ఎందుకు సమస్యలు మనల్ని వరుసగా చుట్టుముడుతున్నాయి వాళ్ళని చూశావా అనుని కన్న కూతురు లాగా చూసుకుంటానని మాటిచ్చి తీసుకువచ్చాను ఈరోజు వాళ్ళ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తల దించుకున్నాను. వాళ్ల ఆరాటానికి కూతురు కోసం పడే బాధకి ఎవరు సమాధానం చెప్తారు అంటుంది ఆమె. నేను చెప్తాను దాదా వదినమ్మ నావల్లే కదా ఇంట్లోంచి వెళ్ళిపోయారు నేనే దాదా వదినమ్మ ని తిరిగి ఇంటికి తీసుకువస్తాను.
నా మూలంగా ఆగిపోయిన సీమంతాన్ని ఘనంగా జరిపిస్తాను అంటాడు నీరజ్. నిజంగా తీసుకొస్తావా అని అతని తల్లి అడగడంతో నిజంగానే తీసుకొస్తాను బాధతో వెళ్లిపోయిన సుబ్బు పద్దు గార్ల ముందే ఘనంగా సీమంతం అన్ని చేస్తాను ఇట్స్ మై ప్రామిస్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నీరజ్. నా మాటలకి కోపంతో పగిలిపోయిన మాన్సీ ఏదైతే జరగకూడదు అనుకున్నాను అదే జరిగే లాగా ఉంది. పోయిన దరిద్రాన్ని తిరిగి తీసుకు వస్తాడంట ఈ మాన్సీ ఉండగా అది ఎప్పటికీ జరగదు అని మనసులో అనుకుంటుంది.
మరోవైపు రోడ్డు మీద వెళ్తున్న అనుని చూస్తాడు కాయగూరల వాడు. అనుని ఎంత పిలిచినా పలకకపోతే ఆమెని అనుసరిస్తాడు కూరగాయల వాడు. ఇదేమీ తెలియని అను అంజలి ఇంటికి వెళ్ళిపోతుంది. అదే ఇంట్లోకి వెళ్ళబోతాడు కాయగూరలు వాడు వాచ్మెన్ ఆపి ఇక్కడ అనురాధ అంటూ ఎవరూ లేరు ఆవిడ ఈ ఇంటి వంట మనిషి అంటాడు. ఏదో జరగరానిదే జరిగి ఉంటుంది ఈ విషయం అర్జెంటుగా సుబ్బు కు చెప్పాలి అంటూ సుబ్బుకి ఫోన్ చేస్తాడు.
మరోవైపు రోడ్డు మీద వస్తున్న పద్దు,శారదమ్మ గారు మన దగ్గర ఏదో దాస్తున్నారు, మన బుజ్జమ్మ వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో నాకు ఏమీ అర్థం కావట్లేదు అంటుంది పద్దు. ఇప్పుడు ఎక్కడని వెతకాలి అని సుబ్బు అంటుండగానే అతనికి ఫోన్ వస్తుంది. నేను బస్తీ సాంబడిని ఎక్కడ హిమాయత్ నగర్ బస్ స్టాప్ లో కూరగాయలు అమ్ముకుంటుంటే అను కనిపించింది అంటాడు. ఏంటి బుజ్జమ్మ కనిపించిందా అని సుబ్బు అంటే అవును చూడడానికి కళకళలాడే మనిషి చాలా దీనంగా కనిపించింది అంటాడు సాంబ.
నువ్వు అక్కడే ఉండు మేము వస్తాము అంటాడు సుబ్బు.ఏం జరిగింది అని పద్దు అడిగితే మన బుజ్జమ్మ ఏమి లేని దీనస్థితిలో కనిపించిందట అంటూనేను ఆరోజు చూసింది బుజ్జమ్మ వాళ్ళనే అన్నమాట ఎంత పని జరిగిపోయింది. ఆ రోజునే వాళ్ళని పట్టుకొని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటాడు సుబ్బు. ఇప్పుడు మనం వెళ్దాం పద అంటూ ఆటోలో సాంప్ర దగ్గరికి వెళ్తారు పద్దు దంపతులు. మా బుజ్జమని ఎక్కడ చూసావు అంటూ కంగారుగా అడుగుతారు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.