సినిమా టైటిల్ –నీదీ నాదీ ఒకే కథ ..

విడుదల తేది –మార్చి 23,2018
కథ –ఒక మధ్యతరగతి కుటుంబ నేపథ్యం
నటీనటులు-సీనియర్ నటుడు పోసాని ,శ్రీవిష్ణు ,సాట్నా టిటస్ ,దేవి ప్రసాద్..

ఛాయాగ్రహణం-రాజ్‌ తోట, పర్వీజ్‌ కె
కూర్పు- బి.నాగేశ్వరరెడ్డి
కళ- టి.ఎన్‌.ప్రసాద్‌
బ్యానర్‌- ఆరాన్‌ మీడియా వర్క్స్‌, శ్రీ వైష్ణవి క్రియేషన్స్‌

మ్యూజిక్ డైరెక్టర్ –బొబ్బిలి సురేష్.
దర్శకుడు :ఊడుగుల వేణు ..
నిర్మాతలు :నారా రోహిత్ ,ప్రశాంతి ,కృష్ణ విజయ్ ,అట్లూరి నారాయణ రావు ..

ఇటివల ఇండస్ట్రీలో పెద్ద పెద్ద సినిమాలు ధియేటర్ల దగ్గర చేతులేత్తేస్తుంటే చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీసుల దగ్గర రికార్డ్లను బద్దలు కొడుతూ హిట్ల మీద హిట్లు కొట్టేస్తున్నాయి.ఈ కోవలోకి వచ్చే సినిమాలు  అప్పట్లో ఒకడుండేవాడు ,మెంటల్ మదిలో ..ఈ సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీవిష్ణు.శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా నీదీ నాదీ ఒకే కథ ..ఈ మూవీ ప్రస్తుత సమాజంలో మధ్య తరగతి కుటుంబాల్లో ఉండే ప్రేమానురాగాలు ,సమస్యలు ,ఉన్నత చదువుల కోసం ఆరాటం ,పరువు ప్రతిష్ట ఇలా పలు అంశాలను భేరీజు వేసుకొని చక్కని కథతో మంచి ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.మరి ఈ మూవీ మధ్యతరగతి కుటుంబాల జీవితాలను ప్రతిబింబించాయా ..నీదీ నాదీ ఒకే కథలా ఉందా ..డిఫెరెంట్ గా ఉందా ..శ్రీ విష్ణు ఖాతాలో మరో విజయం దక్కిందా ఒక లుక్ వేద్దాం ..!

అసలు మూవీ కథ ఏమిటి..
దేవీప్రసాద్ (రుద్రరాజు దేవీప్రసాద్ అనే పాత్రలో )ఒక ప్రొఫెసర్.ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివి ప్రస్తుత సమాజంలో మంచి పరువు ప్రతిష్టలు ఉన్న మధ్య తరగతికి చెందిన ఒక తండ్రి.తనలాగే తన కుమారుడు(శ్రీ విష్ణు)కూడా జీవితంలో ఉన్నత చదువులు చదువుకొని సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకొని.. నేటి తరానికి ఆదర్శంగా నిలవాలని ఆరాటపడుతుంటాడు.మరి శ్రీ విష్ణు ఏమో అప్పటికే మూడు సార్లు డిగ్రీ ఫెయిలై తన సోదరితో కల్సి మళ్ళీ పరిక్షలు రాయడానికి సిద్ధమై కుర్రాడు.మరి తన తండ్రి తనపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చడా ..ఇందుకు శ్రీవిష్ణు ఏమి చేశాడు.అసలు తను ఏమి అనుకుంటున్నాడు.సమాజంలో ఎలా జీవించాలని ..ఏమి ఏమి సాధించాలని అనుకుంటున్నాడు.ఇందులో శ్రీవిష్ణు  ఎలా ..ఏ విధంగా విజయవంతం అయ్యాడు ..తన తండ్రి కోరికను తీర్చాడా ..ఆసలు మిగతా కథ ఏమిటి అనేది తెరపై చూడాల్సిందే ..!

ఎవరు ఎలా నటించారు ..
కుటుంబ విలువలు ,మధ్యతరగతి ప్రేమానురాగాలు ,కష్టాలు ,ఆనందాలు ఇలా ఒక మధ్యతరగతి కుటుంబంలో చోటు చేసుకునే ప్రతి అంశాన్ని ఎంతో చక్కగా ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా మలిచాడు దర్శకుడు. ఈ చిత్రంలో కథ అంతా ఒక తండ్రి కొడుకుల  మధ్య నడిచే కథ కావడంతో ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో రానటివంటి కథాంశంతో,స్క్రీన్ ప్లే తో మూవీలో రెండేపాత్రలు ఉన్న కానీ ధియేటర్లో మూవీ మొదలు దగ్గర నుండి శుభం కార్డు పడేవరకు ప్రేక్షకుడ్ని ఎంతో ఆకట్టుకునేలా దర్శకుడు తెరకేక్కించాడు.ఇందులో తండ్రి పాత్రలో దేవి ప్రసాద్ అత్యద్భుతంగా నటించాడు.ప్రస్తుతం సమాజంలో జీవితంలో ఏమి సాధించలేను అనే నిరుత్సాహంతో బ్రతికే కుర్రాడిగా ..తర్వాత అనుకున్నది సాధించే సత్తా ఉన్నవాడిగా మారడం ఇలారెండు పాత్రల్లో శ్రీవిష్ణు అద్భుతంగా నటించాడు.

ఇప్పటివరకు తండ్రి కొడుకుల  నేపథ్యంగా తెరకెక్కిన  మూవీలలో లేని విధంగా ఒకవైపు తన తండ్రి పెట్టుకున్న ఆశలను నెరవేర్చలేక ..ఆ నెరవేర్చే క్రమంలో తను ఏమి కోల్పోతున్నానో ..తనని తానూ కోల్పోలేక సతమతయ్యే పాత్రలో నాభూతో న భవిష్యత్తు అన్నట్లు నటించి తనలోని అన్ని కోణాలు ఉన్నాయని ఇండస్ట్రీకి చాటి చెప్పాడు విష్ణు  .తొలిసారిగా సిల్వర్ స్క్రీన్ పై కన్పించిన దర్శకుడు దేవీప్రసాద్ నూరుకు నూరు మార్కులు వేయించుకొన్నాడు . ఇక హీరోయిన్ పాత్రలో నటించిన సాట్నా ఈ మూవీతో మరో మెట్టు ఎక్కిందనే చెప్పాలి.తోలి భాగంలో నవ్వించే సీన్లలో ..సెకండాఫ్ లో వచ్చే మంచి ఎమోషనల్ సీన్లలో మంచి ప్రతిభను కనబరిచింది అమ్మడు .

సినిమా ఎలా ఉంది :
ప్రస్తుత ఆధునిక సాంకేతక యుగంలో ప్రతి మధ్య తరగతి కుటుంబాల్లో ఉండే సమస్యలను ,ప్రేమానురాగాలను,ఆప్యాయతలను తన కథగా తీసుకొన్న దర్శకుడు వేణు తన తోలిప్రయత్నంలోనే విజయం సాధించాడు.ప్రస్తుతం ఇండస్ట్రీలో కొంతమంది మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తీస్తారు.మరికొంతమంది యువతను దృష్టిలో పెట్టుకొని తీస్తారు.ఇంకొంతమంది ఫ్యామిలీ ఆడియోన్స్ ను దృష్టిలో పెట్టుకొని తీస్తారు.కానీ వేణు మాత్రం ఆ ముగ్గురు కల్సి చూసే మూవీగా తెరకెక్కించడంలో విజయవంతమై ఇలా కూడా తీయచ్చు అని ఇప్పటివరకు ఉన్న మూస పద్దతికి శుభం కార్డు వేసి ట్రెండ్ సెట్ చేశాడు.

ప్రస్తుతం సమాజంలో అవసరానికి తగ్గట్లు నటించి ముసుగులు వేసుకొని జీవిస్తున్నారు తప్ప సాటి మనిషిపై మనిషి అనే గౌరవం కూడా లేదని చూపించిన విధానం ధియేటర్లో ఉన్న ప్రతి ప్రేక్షకుడి మదిని గెలుచుకునేలా తీయడంలో వేణు విజయం సాధించాడు.తమ పిల్లలను ఏ విధంగా ఉన్నత చదువుల కోసం ,ర్యాంకుల కోసం ఎంత తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తున్నారో ..ఆ ఒత్తిడి వలన పిల్లలు ఎలా మానసిక ఒత్తిడికి గురవుతున్నారో ..మానసిక క్షోభను అనుభవిస్తున్నారో ఇలా పలు అంశాలతో బలమైన ఎమోషనల్ సీన్స్ తో సరికొత్తగా ఆవిష్కరించాడు.సంగీతం ,నేపథ్యం సంగీతం ఈ మూవీకి తగ్గట్లు కథకు ఏ మాత్రం తగ్గకుండా అందించడంలో సురేష్ సక్సెస్ సాధించారు.ఈ మూవీ లో కథ ఆసాంతం వచ్చే నేపథ్య సంగీతంలోని భావోద్వేగాలను మరింతా ఎలివేట్ చేసి ప్రేక్షకుల మదిని కొల్లగొట్టాడు . ఎడిటింగ్ బొంతల నాగేశ్వర రెడ్డి అదుర్ష్ ..సినిమాటోగ్రఫీ ,నిర్మాణ విలువలు మూవీకి తగ్గట్లు ఉండటం మూవీ విజయం సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించాయి.

మూవీ బలం ..!
కథా కథనం
సంగీతం
నేపథ్య సంగీతం
స్క్రీన్ ప్లే
శ్రీవిష్ణు నటన
తండ్రి పాత్రలో దేవీప్రసాద్ నటన

మూవీ బలహీనతలు 
ఇది బలహీనత అని చెప్పుకోవడానికి ఏమి లేకుండా చాలా చక్కగా తెరకెక్కించాడు వేణు ..
నీది నాదీ మాత్రమే కాదు అందరిదీ ఒకే కథ ..ఒక ముక్కలో చెప్పాలంటే ఈ మూవీ ట్రెండ్ సెట్టర్ ..

రేటింగ్: 3/5