బాలకృష్ణ- నయనతారలది సూపర్ హిట్ జోడి ముచ్చటగా మూడోసారి కలిసి నటిస్తున్న బాలయ్య, నయన్ బాలకృష్ణ తల్లి పాత్రలో నయనతార
నందమూరి సింహం బాలకృష్ణ నయన తారల జంటకు ప్రేక్షకులలో ఒక మంచి గుర్తింపు ఉంది. దీనికితోడు వీరద్దరు కలిసి నటిస్తే ఆసినిమా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ కూడ ఉంది. ‘సింహ’ ‘శ్రీరామరాజ్యం’ సినిమాల విజయానికి ఈజంట కెమిస్ట్రీ బాగా సహకరించింది అని విమర్శకులు కూడ ఒప్పుకుంటారు.
ఈనేపధ్యంలో ఈజంటను ముచ్చటగా మూడోసారి కలిపి దర్శకుడు కె.ఎస్.రవికుమార్ తీస్తున్న సినిమాలో నయనతార బాలకృష్ణకు తల్లిగా నటిస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ 102వ సినిమాగా రూపొందుతున్న ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఏకబిగువున జరుగుతున్న విషయం తెలిసిందే. తెలుస్తున్న సమాచారం మేరకు ఈసినిమాలో నయనతార మెయిన్ హీరోయిన్ కాదు అని టాక్. వేరే మరో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు అని తెలుస్తోంది.
సినిమాలోని కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఏపిసోడ్ లో నయనతార సీనియర్ బాలయ్య భార్యగా కనిపిస్తుందని సమాచారం. అదీ కాకుండా కోలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయనతార ఈ చిత్రానికి డేట్స్ ఇవ్వడానికి కారణం బాలయ్య అని అంటున్నారు. ఈ మూవీలో నయనతార పాత్రకు ఉన్న ప్రాధాన్యతను గ్రహించిన బాలకృష్ణ ఆమెను వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేయడంతో నయనతార ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని అంటున్నారు.
ఇది ఇలా ఉండగా బాలకృష్ణ సరసన నటించబోయే యంగ్ హీరోయిన్స్ పాత్రలలో ఒకదానికి మళయాళ హీరోయిన్ నటాషాజోషిని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను వేగంగా పూర్తిచేసి బాలకృష్ణకు సెంటిమెంట్ పరంగా బాగా కలిసివచ్చే రాబోతున్న సంక్రాంతికి విడుదల చేయాలని చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్..
