నిర్మాత నవ రంధ్రములు మూయించిన నయనతార

First Published 26, Dec 2017, 9:28 PM IST
nayanatara made producer quiet when asked her to come  for film event
Highlights
  • బాలకృష్ణ సరసన జైసింహలో నయనతార
  • నయనతారను జైసింహ వేడుకకు ఆహ్వానించిన నిర్మాత
  • నటసింహం అని కూడా చూడకుండా డుమ్మా కొట్టిన నయన్

దక్షిణాది అగ్రతారల్లో ముందు వరుసలో వుండే హిరోయిన్స్ లో నయనతార ఒకరు. గ్లామర్ పాత్రలే కాకుండా లేడీ ఓరియెంటెడ్ రోల్స్ లోనూ సత్తా చాటిన నయనతార వరుసగా సక్సెస్ లు అందుకుంటున్నారు. ఇటీవల ఆమె నటించిన అరమ్ చిత్రం, వేలక్కైరన్ చిత్రాలు హిట్ సినిమాలుగా నిలిటాయి. ప్రస్తుతం తెలుగులో నయనతార నటించిన జై సింహా చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్‌ కానుంది. ఈ ఆడియో కార్యక్రమానికి ఆమె హాజరుకాకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

 

జై సింహ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రంలో నటించిన ఇతర హీరోయిన్లు హరిప్రియ, నటాషా ఇతర నటీనటులు, సాంకేతికవర్గ నిపుణులు, పలువురు రాజకీయ నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ నయనతార మాత్రం రాలేదు.

 

జై సింహా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాలని నయనతారను ప్రత్యేకంగా ఆహ్వానించారట చిత్ర యూనిట్. భారీ ఎత్తున ఫంక్షన్ నిర్వహిస్తున్నందున తప్పనిసరిగా వస్తే మరింత క్రేజ్ వస్తుందని పేర్కొన్నారట. కానీ వ్యక్తిగత కారణాలు చూపి జై సింహా ఆడియోకు డుమ్మా కొట్టింది.

 

బాలకృష్ణతో నయనతార నటించడం ఇది మూడోసారి. గతంలో సింహా, శ్రీరామరాజ్యం చిత్రాల్లో బాలయ్యతో నటించింది. అయితే బాలయ్య స్టాటస్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమానికి నయనతార వస్తుందని అందరూ ఆశించారు. కానీ సీనియర్ నటుడు, నందమూరి నటసింహం అయిన బాలకృష్ణ ఫంక్షన్‌కు రాకపోయే సరికి ఆమె తీరును తప్పుబడుతున్నారు. ఎవరైతే ఏమిటనే విధంగా వ్యవహరించడం సరికాదనే మాట వినిపిస్తున్నది.

 

గత కొద్దికాలంగా తాను నటించిన సినిమా ప్రమోషన్లకు గానీ, ఫంక్షన్లుకు నయనతార హాజరైనట్టు దాఖలాలు లేవు. సినిమాలు అంగీకరించే సమయంలోనే నయనతార కొన్ని షరతులను విధిస్తున్నారని సమాచారం. తెలుగు సినిమా పరిశ్రమలో నయనతారకు భారీ ఆఫర్లు వస్తున్నప్పటికీ తన తీరును మార్చుకోవడం లేదనే వాదన వినిపిస్తున్నది. నయనతార చివరిసారిగా రానా దగ్గుబాటి నటించిన కృష్ణం వందే జగద్దురం చిత్రం ప్రమోషనల్‌ ఈవెంట్లో పాల్గొన్నారు. అప్పటి నుంచి ఏ కార్యక్రమానికి కూడా రాలేదు.

 

ఇటీవల ఓ ప్రముఖ హీరోతో నటించిన సినిమా కార్యక్రమంలో పాల్గొనాలని చిత్ర నిర్మాతలు సంప్రదించారట. అయితే ఆమె ఆ కార్యక్రమానికి రాలేను అని ఖరాఖండీగా చెప్పేసిందట. తప్పనిసరి పరిస్థితిలో రావాలంటే అదనంగా రెమ్యునరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసిందట. దాంతో నిర్మాతలు చేసేదేం లేక అన్నీ మూసుకుని ఈవెంట్ ముగించేశాడట.

loader