బోయ్ ఫ్రెండ్ సమక్షంలోనే నయన్ పుట్టినరోజు వేడుకలు

బోయ్ ఫ్రెండ్ సమక్షంలోనే నయన్ పుట్టినరోజు వేడుకలు

దక్షిణాది లేడీ సూపర్ స్టార్, అందాల నటి నయనతార  33వ పుట్టినరోజు జరుపుకుంటోంది. అందాల తార నయన్ కు సినీ పీపుల్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నయన్ కూడా గ్రాండ్ బర్త్ డే పార్టీ ఇచ్చింది. ఈ పార్టీ చాలా గ్రాండ్ గా జరిగింది. కానీ ఆ పార్టీలో ఒక్కడు మాత్రమే పాల్గొన్నాడు. అతడే విఘ్నేష్ శివన్. అవును. నయన్ ఇచ్చిన ప్రైవేట్ పార్టీకి విఘ్నేష్ ఒక్కడే హాజరయ్యాడు. ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. 

 

దక్షిణాది సూపర్ స్టార్ గా ఎదిగిన ఈ గ్లామర్ హీరోయిన్ తెలుగులో ప్రస్థుతం జై సింహా సినిమాలో నటిస్తోంది. మెగాస్టార్ సరసన సైరా ప్రాజెక్టులోనూ నయన్ ఎంపికైన సంగతి తెలిసిందే.

 

నయన్ పుట్టినరోజు సందర్భందా విగ్నేష్ "బర్త్ డే బాష్ విద్ నయన్" అంటూ సోషల్ మీడియాలో ఫొటో పెట్టి మంచి పదాలతో కూడిన పోస్ట్ చేశాడు. అంతే కాదు.. ఆ ప్రత్యేకమైన ఫొటోను తన ఫీచర్ ఇమేజ్ గా కూడా పెట్టుకున్నాడు. విఘ్నేష్ శుభాకంక్షలు చెప్పిన తర్వాతే నయనతార పుట్టినరోజు వేడుకలు ప్రారంభమయ్యాయని టాక్.

 

ఇటీవలే విఘ్నేష్ పుట్టినరోజును నయన్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. తన సొంత ఖర్చుతో విఘ్నేష్ ను లాస్ ఏంజెల్స్ తీసుకెళ్లి మరీ పుట్టినరోజు సెలబ్రేట్ చేసింది. ఇప్పుడు నయనతార పుట్టినరోజును విఘ్నేష్ సెలబ్రేట్ చేశాడు.

ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న నయన తార వ్యక్తిగత జీవితంలో అనేక కోణాలుండేవి. అయితే ప్రస్థుతం కెరీర్ లో దూసుకెళ్తున్న నయన్ అటు వ్యక్తిగత జీవితంలోనూ హ్యాపీగా వున్నట్లు కనిపిస్తోంది.

 

తమ మధ్య సాన్నిహిత్యాన్ని వీళ్లిద్దరూ రహస్యంగా ఉంచాలనుకోవడం లేదని తెలుస్తోంది. వీలు చిక్కినప్పుడల్లా ఆ విషయాన్ని బయటపెడుతూనే ఉన్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos