దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్ నయనతార హిరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో వరుస సక్సెస్ లు మరోవైపు టాప్ హీరోలతో, యంగ్ హీరోలతోనూ నటిస్తున్న నయనతార తాజాగా బాలకృష్ణ, చిరంజీవిలకు తెగ కండిషన్స్ పెడుతోందట

దక్షిణాది హీరోయిన్లలో నయనతారకున్న క్రేజ్ వేరు. ఒకవైపు హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలతో దుమ్ము రేపుతూనే.. మరోవైపు గ్లామరస్ హీరోయిన్ పాత్రల్లో టాప్ హీరోలతోనేకాక.. యంగ్ హీరోలతో నటిస్తూ తన క్రేజ్ ఏంటో చూపిస్తోంది. రీసెంట్ గా నయన్ నటించిన ‘డోరా’, ‘వాసుకి’ చిత్రాలు.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించటమే కాక.. ఆమె నటనకు కూడా మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం దక్షిణాది సినిమా రంగంలో... హాట్ న్యూస్ గా మారింది.

కోలీవుడ్ వార్తల ప్రకారం ఆమె ఈ మధ్య ఒక వ్యాపార ప్రకటన కోసం భారీ మొత్తాన్ని తీసుకోవడం హాట్ న్యూస్ గా మారింది. నయనతార ఒక డీటీహెచ్ సర్వీస్ వ్యాపార ప్రకటనలో నటించింది. ఆవ్యాపార ప్రకటన నిడివి 50 సెకన్లు మాత్రమే. ఈవ్యాపార ప్రకటన కోసం కేవలం రెండు రోజులు మాత్రమే షూటింగ్‌కు వెళ్లిందట. అయితే ఆమె తీసుకొన్న రెమ్యునరేషన్ మాత్రం 5 కోట్లు అని వార్తలు వస్తున్నాయి. ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోవడం ఫిలిం వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

దీంతో మరింత రెచ్చిపోయిన నయనతార తన లేటెస్ట్ సినిమాలు ఒప్పుకొనే ముందు చాలా షరతులు పెడుతున్నట్టు సమాచారం. ఇప్పుడు ఈ వేడి చిరంజీవి బాలకృష్ణలకు కూడ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ అదే విధంగా బాలకృష్ణ కె.ఎస్ రవికుమార్ ల సినిమాలు రెండింటిలోను నయన తారను హీరోయిన్ గా ఎంపిక చేసిన నేపధ్యంలో తన డేట్స్ కావాలంటే 5 కోట్లు పారితోషికం ఇవ్వాలి అంటూ ఈమె సరి కొత్త కండిషన్ పెడుతున్నట్లు సమాచారం.

ఇప్పటికే తాను నటించే సినిమాల ప్రమోషన్లకు రాకుండా నిర్మాతలకు చుక్కలు చూపించే నయనతార ఈమధ్య ఆమె తెలుగులో నటించిన ఓచిత్ర ప్రమోషన్‌కు రావాలని నిర్మాత కోరినప్పుడు 30 లక్షలు ఇస్తేకాని ప్రమోషన్ కార్యక్రమానికి రానని తెగేసి చెప్పిందన్న వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో నయన్ డిమాండ్స్ కు చిరంజీవి బాలకృష్ణలు ఏ మేరకు తట్టుకోగలరో... ఎలా డీల్ చేస్తారో చూడాలి మరి.