దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ లు ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు వీరి ఫొటోలను నయన్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. ప్రస్తుతం వీరిద్దరూ అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో సమ్మర్ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. తమ పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నయన్. 'స్పెషల్ మూమెంట్స్ అండ్ మెమొరీస్... వీక్కీనయన్' అంటూ ట్వీట్ చేసింది.