Asianet News TeluguAsianet News Telugu

క్యాన్సర్ బాధితులకు మద్దతుగా మనిషా కొయిరాలా సందేశం.. గుండు ఫోటో షేర్ చేస్తూ

మనీషా కోయిరాలా 2012లో స్టేజ్ 4 అండాశయ క్యాన్సర్ బారినపడ్డారు. అయితే దృఢ సంకల్పంతో చికిత్స అనంతరం ఆమె కోలుకొని బయటపడ్డారు.

national cancer awareness day heroin manisha koirala came up with a message
Author
Hyderabad, First Published Nov 8, 2021, 3:40 PM IST

నేపాల్ భామ మనీషా కొయిరాలా (Manisha koirala) సౌత్ నుండి నార్త్ వరకు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారతీయుడు, ఒకే ఒక్కడు చిత్రాలలో ఆమె హీరోయిన్ గా నటించారు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన బొంబాయి చిత్రంతో మనీషా కొయిరాలా ఆ తరం యువత కలల రాణిగా మారిపోయారు. ఈ అందాల నటి 2012లో స్టేజ్ 4 అండాశయ క్యాన్సర్ బారినపడ్డారు. అయితే దృఢ సంకల్పంతో చికిత్స అనంతరం ఆమె కోలుకొని బయటపడ్డారు.

 
ట్రీట్మెంట్ సమయంలో ఆమెకు గుండె చేయడం జరిగింది. చందమామ వలె ఉండే మనిషా కొయిరాలా... అందవిహీనంగా తయారయ్యారు. కాగా క్యాన్సర్ (Cancer) ని ఎదిరించిన మనీషా... ఈ భయంకర వ్యాధి బారిన పడిన రోగులలో ఆత్మ స్తైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. నవంబర్ 7 జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం నేపథ్యంలో ఆమె ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ సందేశం విడుదల చేశారు. 


''జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం (National cancer awareness day) సందర్భంగా ఈ భయంకర వ్యాధి బారినపడ్డ రోగులకు ప్రేమ, విజయం దక్కాలని కోరుకుంటున్నాను. క్యాన్సర్ తో ప్రయాణం చాలా కఠినం అని నాకు తెలుసు... కానీ మనం అంతకంటే కఠినం. ఈ మహమ్మారిని ఎదిరించి నిలిచినవారు సెలెబ్రేట్ చేసుకోవాలి. 

Also read Akhanda Title Song: అబ్బురపరిచే విజువల్స్.. బాలయ్యని చూస్తూ, లిరిక్స్ వింటూ మరో కొత్త లోకంలోకి..
క్యాన్సర్ భారీ నుండి బయటపడిన మనం మన విజయాలు అందరితో పంచుకోవాలి. మిగతా బాధితులలో అవహగాన తీసుకురావాలి. ప్రతి ఒక్కరిలో ఆత్మ విశ్వాసం నింపి... ఇతరుల పట్ల దయ కలిగి, వాళ్ళ బాగు కోసం ప్రార్ధనలు చేయాలి'' అంటూ తన సందేశంలో మనీషా కొయిరాలా పొందుపరిచారు. అలాగే ఇతరులలో ధైర్యం నింపడం కోసం, క్యాన్సర్ రోగిగా ఉన్నప్పటి తన ఫోటోలు షేర్ చేశారు. ఆ ఫోటోలలో ఆమె గుండుతో కనిపించారు. 

Also read సింగర్ శ్రీరామచంద్ర ప్రైవేట్ చాట్ లీక్ చేసిన శ్రీరెడ్డి...చాట్ లో అలాంటి ఫోటోలు కావాలన్న బిగ్ బాస్ కంటెస్టెంట్

చిత్ర పరిశ్రమలో సోనాలి బింద్రే (Sonali bindre), లిసా రే, సంజయ్ దత్, రాకేష్ రోషన్ వంటి వారు క్యాన్సర్ బారినపడ్డారు. ట్రీట్మెంట్ అనంతరం వారు... మాములు మనుషులుగా ఆరోగ్యకర జీవితం గడుపుతున్నారు. యంగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సైతం కాన్సర్ బారినపడగా... చికిత్స తరువాత కోలుకున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manisha Koirala (@m_koirala)

Follow Us:
Download App:
  • android
  • ios