నారా రోహిత్‌ ఇటీవల `భైరవం` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఓ ఇంటర్వ్యూలో రోహిత్‌ మాట్లాడుతూ, వంద కోట్ల మూవీని మిస్‌ చేసుకున్నట్టు తెలిపారు.

హీరో నారా రోహిత్‌ చాలా గ్యాప్‌ తర్వాత ఇటీవల `భైరవం` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఇందులో మంచు మనోజ్‌, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ లతో కలిసి హీరోగా నటించారు. శుక్రవారం విడుదలైన మూవీ డిసెంట్‌ ఓపెనింగ్స్ తో రన్‌ అవుతుంది. అయితే సోమవారం నుంచి బాక్సాఫీసు వద్ద సవాళ్లని ఫేస్‌ చేస్తుందని తెలుస్తుంది.

సినిమాలకు గ్యాప్‌ పై నారా రోహిత్‌ కామెంట్స్ 

ఇదిలా ఉంటే ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న నారా రోహిత్‌ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తనకు గ్యాప్‌ రావడానికి కారణం తెలిపారు. అదే సమయంలో ఒక వంద కోట్ల సినిమాని మిస్‌ చేసుకున్నట్టు తెలిపారు. 

కరోనాకు ముందు తాను వరుసగా సినిమాలు చేశానని, కానీ అవి ఆడలేదు. దీంతో తాను ఎక్కడో మిస్టేక్‌ చేస్తున్నానని అనిపించి, కాస్త గ్యాప్‌ తీసుకోవాలనుకున్నాడట. ఏడాది గ్యాప్‌ తర్వాత మళ్లీ సినిమాలు చేయాలనుకున్నాడట.

ఒక స్క్రిప్ట్ అనుకుంటే వర్కౌట్‌ కాకపోవడం, ఆ తర్వాత తన తండ్రి అనారోగ్యానికి గురికావడంతో ఆయన్ని చూసుకోవాల్సి వచ్చిందని, ఆ నెక్ట్స్ ఇయర్‌ అనుకుంటే కోవిడ్‌ వచ్చిందని, దీంతో మరింత గ్యాప్‌ వచ్చిందని తెలిపారు రోహిత్‌.

 `సుందరాకాండ` చిత్రంతో తాను కమ్‌ బాక్‌ కావాల్సింది, కానీ ఎన్నికల కంటెంట్‌ కాబట్టి `ప్రతినిధి 2` చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత `భైరవం` చేశానని వెల్లడించారు. `సుందరాకాండ` మూవీ విడుదలకు రెడీ అవుతుందన్నారు.

`గీత గోవిందం` సినిమా నేనే చేయాల్సింది

ఇక తాను మిస్‌ చేసుకున్న వంద కోట్ల సినిమా గురించి చెబుతూ, `గీత గోవిందం` సినిమాని తానే చేయాల్సిందట. దర్శకుడు పరశురామ్‌ తనకు ఫ్రెండ్‌ అని, ప్రారంభంలో ఈ కథపై వర్క్ చేసినట్టు తెలిపారు. `సోలో` టైమ్‌లోనే దీనిపై కూర్చున్నామన్నారు.

ఆ తర్వాత లెక్కలు మారిపోయానని, అది విజయ్‌ దేవరకొండ వద్దకు వెళ్లిందన్నారు నారా రోహిత్‌. విజయ్‌ చాలా బాగా చేశాడు. ఆయన చేయడం వల్లే ఈ మూవీ అంత పెద్ద హిట్‌ అయ్యిందన్నారు.

నేను చేస్తే అంత పెద్ద హిట్టయ్యేది కాదేమో

తాను చేసి ఉంటే ఆ స్థాయి హిట్‌ వచ్చేది కాదన్నారు. అప్పటికే విజయ్‌కి `అర్జున్‌రెడ్డి` లాంటి బ్లాక్‌ బస్టర్‌ పడింది. ఆ ఊపులో ఇది రావడంతో పెద్ద హిట్‌ అయ్యిందన్నారు. ఒకవేళ తాను చేయాల్సి వస్తే తనకు కూడా ముందు అలాంటి హిట్‌ ఉంటే వర్కౌట్‌ అయ్యేదన్నారు నారా రోహిత్‌. ఆయన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. 

అయితే రోహిత్‌ మాటల్లో నిజాయితీ ఉందని, అదే ఆయన గొప్పతనం అని, హంబుల్‌, అండ్‌ డౌన్‌ టూ ఎర్త్ పర్సన్‌ అని, సరైన స్క్రిప్ట్ లు పడితే ఆయనేంటో తెలుస్తుందని రోహిత్‌ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

విజయ్‌, రష్మిక మందన్నా కాంబినేషన్‌లో `గీత గోవిందం` 

ఇక విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి నటించిన `గీత గోవిందం` మూవీకి పరశురామ్‌ దర్శకుడు. ఈ చిత్రం 2018లో విడుదలైంది. ఫ్యామిలీ,లవ్‌ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ పెద్ద విజయం సాధించింది. 

ఏకంగా వంద కోట్లకుపైగా వసూళ్లని రాబట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాతో విజయ్‌ రేంజ్‌ మారిపోయింది. ఇండస్ట్రీలో, అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్‌ వచ్చింది. ఈ దెబ్బతో ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యారు విజయ్.