శ్రీరెడ్డికి ఘాటుగా రిప్లై ఇచ్చిన నాని భార్య

యాంకర్, నటి శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ పేరిట ఉద్యమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ ఉద్యమం కాస్త దారి మళ్లీ.. సెలబ్రెటీలపై వ్యక్తిగత విమర్శలకు దారి తీసింది. మొదట పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలకు దిగిన శ్రీరెడ్డి.. ఇప్పుడు టార్గెట్ నేచురల్ స్టార్ నానిపైకి మళ్లించింది. గత కొంతకాలంగా.. నానిపై అభ్యంతకరంగా, అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. 

కాగా.. . ఆధారాలు లేకుండా ఎవరో చేసే కామెంట్లను తాను స్పందించను అని చెప్పిన నాని.. ఆమెకు లీగలు నోటీసులు పంపిస్తున్నట్లు వెల్లడించారు. తాను ఇంతకాలం సహనంగా ఉన్నానని.. సహనానికి కూడా హద్దు ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు. కాగా.. ఇప్పుడు వీరిద్దరి ఇష్యూలోకి నాని భార్య  అంజన ఎంటర్ అయ్యారు.

 

Scroll to load tweet…

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆమె ఓ పోస్టు పెట్టారు. ‘సినీ ప‌రిశ్ర‌మ చాలా ద‌యాగుణంతో ఉంటుంది. ప‌బ్లిసిటీ కోసం వేరొక‌రి జీవితాల‌తో ఆడుకుంటున్న కొందరు పరిశ్రమలోకి వ‌స్తుండ‌డం నన్ను ఇబ్బందికి గురిచేస్తోంది. అయితే వారు చేస్తున్న చెత్త కామెంట్లను ఎవ‌రూ ప‌ట్టించుకోర‌ు. కానీ, త‌మ వ్య‌క్తిగత జీవితాన్ని అంత దిగువ స్థాయికి దిగ‌జార్చుకోవ‌డానికి వారు ఎలా సిద్ధ‌ప‌డ‌తారో, వారికే తెలియాలి’ అంటూ శ్రీరెడ్డిని ఉద్దేశించి ఘాటుగా పోస్ట్ పెట్టింది. దానికి నాని కేసు పెడుతున్నట్టు పెట్టిన పోస్టును అటాచ్ చేసింది.