కొరటాల,నాని కాంబినేషన్ ఖాయమైపోయినట్టే!

Nani to work with koratala shiva
Highlights

కొరటాల నాని కాంబినేషన్  ఖాయమైపోయినట్టే!

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'భరత్ అనే నేను' ఇంకా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. మహేశ్ బాబు కెరియర్లోనే పెద్ద హిట్ గా నిలిచిన చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ మాత్రం కాలేదు. ఈ నేపథ్యంలో కొరటాల తదుపరి సినిమా ఏ హీరోతో వుండనుందనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.

కొరటాల నెక్ట్స్ సినిమా  అల్లు అర్జున్ .. చిరంజీవి పేర్లు వినిపించాయి. కానీ చిరంజీవితో చేయడానికి కొరటాల ఆసక్తి చూపిస్తున్నాడు. అయితే ప్రస్తుతం సెట్స్ పై వున్న 'సైరా' సినిమాను పూర్తి చేయడానికి చిరంజీవికి చాలా సమయం పడుతుంది. అందువలన ఈ లోగా కొరటాల .. నానితో ఒక సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. ఆల్రెడీ నానికి కొరటాల కథ వినిపించడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయాయని అంటున్నారు. కొరటాల స్నేహితుడు సుధాకర్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నట్టు సమాచారం.  

loader