పవన్, బాలయ్య అభిమానులను టెన్షన్ పెడుతున్న నాని

First Published 27, Nov 2017, 4:39 PM IST
nani threatens pawan balakrishna fans for akhil hello
Highlights
  • సంక్రాంతి రేసులో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ
  • ఇద్దరి మధ్యలో సంక్రాంతి బరిలో దిగేందుకు ట్రై చేస్తున్న నాని
  • హలోతో నానికి పోటీ లేకుండా చూడాలని దిల్ రాజుపై నాగార్జున ఒత్తిడి
  • నాని ఎం.సి.ఎ చిత్రాన్ని సంక్రాంతికి ప్లాన్ చేస్తున్న దిల్ రాజు

డిసెంబర్ మూడవ వారంలో విడుదల కావలసి ఉన్న నాని ‘ఎంసిఏ’ విడుదలను సంక్రాంతికి వాయిదా వేసి ఈమూవీని పవన్,బాలకృష్ణల సినిమాల మధ్య నిలబెడితే ఎలా ఉంటుంది అని నిర్మాత దిల్ రాజు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు పై నాగార్జున తన ‘హలో’ కి సంబంధించి చేస్తున్న ఒత్తిడి అని అంటున్నారు. నాగార్జునకు సెంటిమెంట్ గా కలిసి వచ్చే డిసెంబర్ నెలను అఖిల్ కు కూడ కలిసి వచ్చేలా ‘హలో’ మూవీని డిసెంబర్ 23న విడుదల చేయడానికి నాగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాడు.

 

అయితే దిల్ రాజు తన ‘ఎంసిఏ’ ని కూడా అదే డేట్స్ కు విడుదల చేయడం నాగార్జునకు ఏమాత్రం రుచించడంలేదు. దీంతో నాని సినిమా విడుదల డేట్ ను మార్చమని నాగ్ దిల్ రాజ్ పై వ్యూహాత్మకంగా ఒత్తిడి చేస్తున్నాడని తెలుస్తోంది. దీనితో తన ‘ఎంసిఏ’ ను వింటర్ రేస్ కు బదులు సంక్రాంతి రేస్ కు తీసుకు వస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన దిల్ రాజ్ కు వచ్చినట్లు తెలుస్తోంది. 

 

దీనికితోడు ఈసంవత్సరం సంక్రాంతికి వచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి బడా హీరోల  సినిమాల మధ్య దిల్ రాజు శర్వానంద్ నటించిన ‘శతమానం భవతి’ ని విడుదల చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ఫాలో అయితే నాగార్జున ఒత్తిడి తప్పించుకోవడమే కాకుండా సంక్రాంతి సీజన్ కలెక్షన్స్ లో తన ‘ఎంసిఏ’ కూడ షేర్ క్రియేట్ చేయొచ్చన్న ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు కు నైజాం ఏరియాలో పట్టు ఉండటంతో పాటు ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొన్ని జిల్లాలలో.. కూడ దిల్ రాజు సన్నిహితులకు థియేటర్లు అధిక సంఖ్యలో ఉన్నాయి. ఈనేపథ్యంలో నానీని పవన్ బాలయ్యల వార్ మధ్య నిలిపితే నానీకి కొనసాగుతున్న అదృష్టం రీత్యా మరో సంచలనం క్రియేట్ చేసినట్లు అవుతుందని దిల్ రాజ్ ఎత్తుగడ అని అంటున్నారు. అయితే తమ హీరో సినిమా వచ్చిన సమయంలో నాని సినిమా రావటం సరికాదని ఇటు పవన్, అటు బాలయ్యల అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కలెక్షన్స్ తగ్గిపోవటానికి తప్ప మరేంలేదని అంటున్నారు.

loader