Asianet News TeluguAsianet News Telugu

నాని 'గ్యాంగ్ లీడర్' సెన్సార్ కంప్లీట్.. పాజిటివ్ టాక్!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్ లీడర్. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శుక్రవారం రోజు థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది. ఈ ఏడాది నాని జెర్సీ చిత్రంతో మెప్పించాడు. దీనితో గ్యాంగ్ లీడర్ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. 

Nani's Gang leader completes censor
Author
Hyderabad, First Published Sep 11, 2019, 2:46 PM IST

మనం ఫేమ్ విక్రమ్ కుమార్, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో వస్తున్న గ్యాంగ్ లీడర్ చిత్రం సిసెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐదుగురు ఆడవాళ్లతో కలసి నాని ఎలాంటి రివేంజ్ తీర్చుకున్నాడనేదే ఈ చిత్ర కథ. విక్రమ్ కుమార్ సినిమాల్లో స్క్రీన్ ప్లే మ్యాజిక్ కనిపిస్తుంది. 

గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని కూడా విక్రమ్ కుమార్ ట్విస్టులతో సర్ ప్రైజ్ చేస్తూనే వినోదాత్మకంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో  నాని పెన్సిల్ పార్థసారథిగా నటిస్తున్నాడు. ప్రియాంక అరుళ్ మోహన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలని జోరుగా సాగిస్తోంది. 

తాజాగా గ్యాంగ్ లీడర్ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు గ్యాంగ్ లీడర్ చిత్రానికి 'యూఏ' సర్టిఫికెట్ అందించారు. సెన్సార్ సభ్యుల నుంచి చిత్రానికి మంచి టాక్ వచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఈ చిత్రంలో విలన్ గా ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ నటిస్తున్నాడు. అనిరుధ్ సంగీత దర్శకుడు. 

పిల్ల బాగుందా.. నాకు ఇదో జాబ్ అయిపోయింది.. ప్రీరిలీజ్ ఈవెంట్ లో నాని

గ్యాంగ్ లీడర్ ప్రీరిలీజ్: చిరంజీవి, రవితేజ.. మా జనరేషన్ కు నాని!

గ్యాంగ్ లీడర్ ప్రీరిలీజ్: ఆ టైంలో నాని చెప్పిన మాట ఎప్పటికి మరచిపోలేను!

'గ్యాంగ్ లీడర్' ప్రీరిలీజ్ ఈవెంట్: నాని లాంటి నటుడుండడం అదృష్టం!

Follow Us:
Download App:
  • android
  • ios