నాని మాట్లాడుతూ, చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైమ్‌ బ్లేజర్‌ వేసుకుని ఏం పీకామని అంటూ బోల్డ్ కామెంట్‌ చేశారు. ఈ ఈవెంట్‌కి బ్లేజర్‌తో వచ్చాడు నాని. బ్లేజ్‌ బాగుందా అంటూ అభిమానులను అడిగారు.

నేచురల్‌ స్టార్‌ నాని(Nani) హీరోగా నటిస్తున్న చిత్రం `శ్యామ్‌ సింగరాయ్‌`(Shyam Singha Roy). నాని ద్విపాత్రాభినయం చేసిన చిత్రమిది. సాయిపల్లవి(Sai Pallavi), కృతి శెట్టి కథానాయికలుగా నటించారు. రాహుల్‌ సాంక్రిత్యాన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 24న క్రిస్మస్‌ కానుకగా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఇందులో హీరో నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాపై తాను ఎంత నమ్మకంగా ఉన్నానో చెప్పారు. 

nani మాట్లాడుతూ, చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైమ్‌ బ్లేజర్‌ వేసుకుని ఏం పీకామని అంటూ బోల్డ్ కామెంట్‌ చేశారు. ఈ ఈవెంట్‌కి బ్లేజర్‌తో వచ్చాడు నాని. బ్లేజ్‌ బాగుందా అంటూ అభిమానులను అడిగారు. వాళ్లు గట్టిగా అరుస్తూ బాగుందని చెప్పారు. ఈ సందర్భంగా బ్లేజర్‌ కథ చెప్పాడు నాని. `ట్విట్టర్‌లో, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలో ఫాలో అయ్యేవారంతా.. ఎప్పుడు వైట్‌ షర్ట్ , బ్లాక్‌ షర్ట్ వేసుకుంటామని అంటున్నారు.దీంతో మా వైఫ్‌ ఓ పది బ్లేజర్లు కొనింది. వాటిని నేను వేసుకోను, అంత ధైర్యం లేదు. అప్పుడప్పుడు బయటకు వెళ్లినప్పుడు వేసుకోమని చెబుతుంటే.. సూట్లు వేసుకుని తిరగడానికి మనం ఏం పీకామని వద్దులే అని చెప్పి లోపలే పెట్టేశాను. 

దీంతో దుమ్ముపట్టిపోయాయి. ఇప్పుడు శ్యామ్‌ సింగరాయ్‌ సినిమా చూశాక.. తీసి బ్లేజర్‌ వేసుకోవాలనిపించింది. ఎందుకో ఈ రోజు ఆ ఎలిజిబిలిటీ వచ్చిందనిపించింది. నాకు ధైర్యం వచ్చిందనిపిస్తుంది. ఇంతకు మించి సినిమా గురించి ఏం చెప్పలేను. ఇప్పటికే సినిమా ఎలా ఉందో అర్థమై ఉంటుంది` అని చెప్పారు నాని. సినిమా సూపర్‌ హిట్‌ కాబోతుందనే విషయాన్ని ఈ రూపంలో వెల్లడించారు. మా ఆనందం ఎందుకొచ్చింది మరో ఐదు రోజుల్లో తెలుస్తుందన్నారు. అదే సమయంలో ముందుగా స్టేజ్‌పై `సిరివెన్నెల` పాటని పాడిన సింగర్స్ టీమ్‌ని అభినందించాడు నాని. ఇక ఈ కార్యక్రమంలో నానితోపాటు సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా, దర్శకుడు రాహుల్‌ సాంక్రిత్యాన్‌, ఇతర గెస్టులు పాల్గొన్నారు. 

also read: Shyam Singha Roy Song: పూనకాలు తెప్పిస్తున్న `ప్రణవాలయ` సాంగ్‌.. సాయిపల్లవి నాట్య విశ్వరూపం