ఇందులోని మరో సాంగ్ ని విడుదల చేశారు. 'ప్రణవాలయ పాహి.. పరిపాలయల పరమేసి.. కమలాయల శ్రీదేవి.. కురిపించవే కారుణాంభురాశి..' అంటూ సాగిన ఈ క్లాసికల్ సాంగ్ ప్రేక్షకులకు మంత్రముగ్దులను చేస్తోంది.

సాయిపల్లవి(Sai Pallavi) ఎంతటి అద్భుతమైన డ్యాన్సరో తెలిసిందే. బెస్ట్ డాన్సర్‌గా నిరూపించుకుంది. ఇటీవల వచ్చిన `లవ్‌స్టోరీ`లో అద్భుతమైన డాన్సుతో మెస్మరైజ్‌ చేసింది. ఇప్పుడు మరోసారి తన డాన్సుతో పిచ్చెక్కిస్తుంది. సాంప్రదాయ నృత్యంలో అద్భుతమైన డాన్సుతో ఒళ్లు గగుర్పాటుకి గురి చేస్తుంది. సాయిపల్లవి ప్రస్తుతం నేచురల్‌ స్టార్‌ నానితో కలిసి `శ్యామ్‌సింగరాయ్‌`(Shyam Singha Roy) చిత్రంలో నటిస్తుంది. కృతి శెట్టి మరో కథానాయిక. ఈ సినిమా ఈ నెల 24న విడుదల కాబోతుంది. శనివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్ ని నిర్వహిస్తున్నారు. 

ఈ సందర్భంగా ఇందులోని మరో సాంగ్ ని విడుదల చేశారు. 'ప్రణవాలయ పాహి.. పరిపాలయల పరమేసి.. కమలాయల శ్రీదేవి.. కురిపించవే కారుణాంభురాశి..' అంటూ సాగిన ఈ క్లాసికల్ సాంగ్ ప్రేక్షకులకు మంత్రముగ్దులను చేస్తోంది. ఇందులో సాయిపల్లవి డాన్సు మైండ్ బ్లోయింగ్‌గా ఉందని చెప్పడంలో అతిశయోక్తిలేదు. కోల్‌కత్తా కాళికామాత తరహాలో ఆమె నృత్యం చేస్తూ తన నాట్య విశ్వరూపం చూపిస్తుంది. అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్, మతిపోగొట్టే హవభావాలు, మెస్మరైజ్‌ చేసే మూవ్‌మెంట్స్ తో ఆమె అదరహో అనిపిస్తుంది. జస్ట్ లిరికల్‌ వీడియోలోని కొన్ని క్లిప్పులోనే సాయిపల్లవి ఈ స్థాయిలో ఆకట్టుకుంటుంటే, ఇక సినిమాలో, పూర్తి వీడియోలో ఆమె ఏ రేంజ్‌లో అదరగొట్టిందే వేరే చెప్పక్కర్లేదు. జస్ట్ దుమ్ముదుమారం చేసిందని చెప్పొచ్చు. ఈ పాట ఇప్పుడు సినిమాపై అంచనాలను పెంచుతుంది.

ఇప్పటికే 'శ్యామ్ సింగరాయ్' నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చాయి. ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచింది. సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ ఈ వైవిధ్యమైన చిత్రానికి ఆకట్టుకునే మ్యూజిక్ అందించారు. ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలు శ్రోతలను విశేషంగా అలరిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'ప్రణవాలయ' అనే నాల్గవ పాటను రిలీజ్ చేశారు. సాయిపల్లవి ఇందులో దేవదాసి పాత్ర పోషిస్తుంది. ఆ పాత్రలో స్టేజి మీద `ప్రణవాలయ` నృత్యం చేస్తుండగా, అది చూస్తూ శ్యామ్‌ సింగరాయ్‌గా నాని ఆమెని చూస్తూ మంత్రముగ్దుడవుతున్నాడు. ఈ పాటకి లెజెండరీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాట రాయడం విశేషం. యువ గాయకుడు అనురాగ్ కులకర్ణి ఉత్సాహంగా పాడారు. ఈ పాటకు జాతీయ అవార్డు గ్రహీత కృతి మహేష్ కొరియోగ్రఫీ చేశారు.

'శ్యామ్ సింగరాయ్' చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఇది నాని కెరీర్ లో పెద్ద బడ్జెట్‌ చిత్రం. ఇందులో సాయిపల్లవి, కృతి శెట్టిలతోపాటు మడోన్నా సెబాస్టియన్ మరో హీరోయిన్‌గా నటిస్తుంది. నాని ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళంలో పాన్ ఇండియా లెవల్‌లో విడుదల చేస్తున్నారు. 

also read: Firstday Collections-Roundup 2021: పవన్‌ని కొట్టలేకపోయిన బన్నీ.. బాలయ్య, రవితేజ ఈ ఏడాది ఎవరి లెక్క ఎంత ?