ఎంసీఏ కలెక్షన్స్ సునామీ

nani dil raju mca collections
Highlights

  • నాని సాయిపల్లవి కాంబినేషన్ లో తెరకెక్కిన ఎంసీఏ
  • దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఎంసీఏ
  • వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కలెక్షన్స్ జోరు

నాని హీరోగా నటించిన ఎమ్‌సీఏ-మిడిల్ క్లాస్ అబ్బాయ్ సినిమా వసూళ్ల లో హై క్లాస్ అనిపించుకుంటోంది. నాని గత చిత్రం ‘నిన్నుకోరి’ ఓపెనింగ్స్‌ కంటే ‘ఎం.సి.ఎ’ అత్యధికంగా వసూలు చేసినట్లు సమాచారం. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజున దాదాపు రూ.15 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. నాని గత చిత్రం తొలిరోజు వసూళ్లకి ఈ మొత్తం రెండింతలు ఎక్కువట. దీంతో నాని కెరీర్‌లోనే ఓపెనింగ్‌ రోజున ఎక్కువ కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా ‘ఎం.సి.ఎ’ నిలిచింది. 

 

ప్రత్యేకించి ఓవర్సీస్, మల్టీప్లెక్స్ లలో ఈ సినిమాకు తిరుగులేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. ప్రీమియర్ షోల్లో ఈ సినిమా భారీ వసూళ్లను సాధించుకుందని సమాచారం. యూఎస్ ప్రీమియర్ల గురించి వస్తున్న వసూళ్ల లెక్కలు ఆసక్తిదాయకంగా ఉన్నాయి. ఏకంగా మూడు లక్షల డాలర్ల మొత్తాన్ని ప్రీమియర్ షోల ద్వారానే రాబట్టుకుందట నాని సినిమా. ఈ హీరో వరస విజయాల మీద ఉన్న నేపథ్యంలో యూఎస్ లో ‘ఎమ్‌సీఏ’కి బ్రహ్మాండమైన స్పందన వచ్చిందని చెప్పవచ్చు.

 

నాని పై ఉన్న నమ్మకం, దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చే సినిమాపై ఉండే అంచనాలతో ఎమ్‌సీఏకు ఈ స్థాయి వసూళ్లు వచ్చాయని చెప్పవచ్చు. నాని కెరీర్ లో సూపర్ హిట్ అనదగ్గ ‘నేను లోకల్’కు ప్రీమియర్స్ లో ఒకటిన్నర లక్షల డాలర్లు వచ్చాయి. అయితే ఎమ్‌సీఏకు మాత్రం రెట్టింపు ఓపెనింగ్స్ లభించినట్టు lలెక్కలు తేలుతున్నాయి.

loader