Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఫిబ్రవరి 13వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం. 

ఈరోజు ఎపిసోడ్లో తులసి అభితో మాట్లాడుతూ ఏదో ఒక రోజు నువ్వు మారతావన్న ఆశతో, కానీ నిజం తెలిసిన రోజు అమెరికాలో ఉన్న నిన్ను విడిచి ఇండియాకు వచ్చేస్తుంది అనడంతో అభి షాక్ అవుతాడు. ఈ అమ్మ మీద నీకు కోపం ఉండవచ్చు కానీ ఏ తల్లి కూడా బిడ్డకు శత్రువు కాదు అని అంటుంది తులసి. ఏ లోకంలో ఉన్న ఆ తల్లి బిడ్డ సంతోషమే కోరుకుంటుంది. ఒక్కసారి నేను చెప్పిన మాటలు గురించి ఆలోచించుకో అభి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తులసి. ఆ తర్వాత లాస్య బట్టలు సెలెక్ట్ చేసుకుంటూ ఎందుకు ఈ మధ్య నందు నన్ను పట్టించుకోవడం లేదు అనుకుంటూ ఉంటుంది. అప్పుడు లాస్య ఒక చీర సెలెక్ట్ చేసుకుని ఈరోజు కేఫ్ కి ఇది కట్టుకుని పోదాము.

నందుకి కూడా బట్టలు సెలెక్ట్ చేద్దాము అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత నందు ప్యాంటు బరువుగా అనిపించడంతో ఏంటి ప్యాంటు బరువుగా ఉంది అనుకొని ఓపెన్ చేసి చూడగా అందులో నెక్లెస్ ఉండగా ఏంటి అని ఆశ్చర్యపోతూ ఉంటుంది లాస్య. వాలెంటైన్స్ డే వస్తుంది కదా నా కోసం తెచ్చాడు అనుకుంటూ ఆ నెక్లెస్ చూసి మురిసిపోతూ ఉంటుంది. నెక్లెస్ నందు చేతుల మీదుగానే తీసుకుంటాను అని నెక్లెస్ అక్కడే పెట్టి వెళ్ళిపోతుంది లాస్య. ఆ తర్వాత తులసి బయట స్కూటీ కడుక్కుంటూ ఉండగా ఇంతలో అక్కడికి నందు వస్తాడు. అప్పుడు నందు నెక్లెస్ ఎలా గిఫ్ట్ ఇవ్వాలి ఇంట్లో అందరూ ఉన్నారు.

తులసితో పాటు బైక్ లో వెళితే దారిలో ఇవ్వచ్చు అనుకుంటూ కారు తుడుస్తూ ఉండగా అప్పుడు తులసి పదేపదే చేసిన పని చేసే వారిని ఏమంటారు అనగా ముసలోడు అంటాడు లేదా మతిమరిపోడు అంటాడు అని నందు అనగా అయితే మీకు మతిమరుపు అని అంటుంది తులసి. అదేంటి తులసి అనడంతో మార్నింగ్ కారు క్లీన్ చేశారు కదా మళ్లీ ఎందుకు క్లీన్ చేస్తున్నారు అని అంటుంది. అప్పుడు నందు ఏం చెప్పాలి అర్థం కాక అలాగే ఉంటాడు. అప్పుడు ఎలా అయినా కారు చెడిపోయేలా చేసి తులసి బైక్ లో వెళ్లాలి అనుకుంటూ ఉండగా అంకిత అక్కడికి వచ్చి కాఫీ ఇస్తుంది.

ఇప్పుడు ఎలా అయినా కారు చెడగొట్టాలి అనుకుంటూ నందు టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు నందు కారు చెడిపోయేలా చేసి ఆనందంగా లోపలికి వెళ్తాడు. గదిలోకి వెళ్లిన నందు ఆనంద పడుతూ ఉంటాడు. ఆ తర్వాత లాస్య బట్టలు సెలెక్ట్ చేయడం చూసి ఎలా అయినా లాస్యను నాతోపాటు రానివ్వకుండా చేసి నేను తులసి బైక్లో వెళ్లాలి అనుకుంటూ ఉంటాడు. అప్పుడు కావాలనే లాస్య చీర టీలో పడాలి అనే ప్లాన్ వేసి లాస్య చీరను టీ లో పడేస్తాడు. అది చూసి లాస్య కుళ్ళుకుంటూ ఉంటుంది. ఒక పని చెయ్ లాస్య నువ్వు చీర సెలెక్ట్ చేసుకుని నిదానంగా చెప్పినా నేను వెళ్ళిపోతాను అని నందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత నందు కార్లో కూర్చొని తులసి వస్తే డ్రామా మొదలుపెట్టాలి అనుకుంటూ ఉంటాడు. తర్వాత తులసి రావడంతో కారు చెడిపోయింది అని డ్రామా మొదలుపెడతాడు నందు. అప్పుడు తులసి నేను కూడా నీ బైక్ మీద వస్తాను అనడంతో సరే అని అంటుంది. తర్వాత ఇద్దరూ కలిసి బైక్ లో వెళ్తుండగా అది చూసి లాస్య కుళ్ళుకుంటూ ఉంటుంది. తర్వాత తులసి నందు ఇద్దరు బైక్ పై వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత తులసి వాళ్లకు బండిపై ఒక జంట కనిపించడంతో తులసి వెళ్లి బండి ఆపమని చెబుతుంది. అప్పుడు అబ్బాయి లవర్ కి రింగ్ నీ బండిపై ఇవ్వడంతో ఒక చోట నిలబెట్టి ఇలా చేస్తే ఆక్సిడెంట్ అవుతాది అన్న కామన్ సెన్స్ లేదా అని తిడుతుంది. అప్పుడు నందు తన గిఫ్ట్ ని తులసికి ఇవ్వకుండా దాచుకుంటాడు. అప్పుడు తులసి నందుని పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్లిపోవడంతో నందు గిఫ్ట్ ఇవ్వడానికి తిప్పలు పడుతూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి లాస్య వస్తుంది.