Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఫిబ్రవరి 14వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో లాస్య నందుతో ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటుంది. ఏంటి ఈమధ్య స్టైల్ ఎక్కువయింది పాకెట్లో నుంచి చెయ్యి బయటికి రావడం లేదు అని అంటుంది. స్టైల్ ఏం లేదు లాస్య అని అంటాడు నందు. అప్పుడు లాస్య నందు చుట్టూ తిరుగుతూ నందువైపు అనుమానంగా చూస్తూ ఉండడంతో కొంపదీసి లాస్యకు నిజం తెలిసిపోయిందా అనుకుంటూ ఉంటాడు నందు. ఎందుకు నా వైపు అలా చూస్తున్నావు అనడంతో అప్పుడు లాస్య నువ్వు నాకు ఏవైనా ఇవ్వాల్సింది చెప్పాల్సింది ఉందేమో అని అనగా అదేం లేదు అని అంటాడు నందు. అప్పుడు లాస్య మనసు మార్చుకొని రేపు వాలెంటెన్స్ డే రోజు గిఫ్ట్ గా ఇద్దామనుకున్నాడేమో అనుకుంటూ ఉంటుంది.
అప్పుడు వాలెంటైన్స్ డే కోసం కేఫ్ ని రెడీ చేయడానికి తులసి మాట్లాడుతూ ఉండగా అప్పుడు మేము కేఫ్ రెడీ చేయము మేడం అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు తులసి ఎలా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ప్రేమ్ తన గ్యాంగ్ ని మొత్తం తీసుకుని రావడంతో అది చూచి తులసి సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు లాస్య నెక్లెస్ గురించి దొంగ తిరుగుడు మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత ప్రేమ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి కేఫ్ ని రెడీ చేయడానికి వెళుతూ వెళ్తారు. ఆ తర్వాత తులసి నందుకి అప్పజెప్పాల్సిన లెక్కల గురించి తెలుస్తూ ఉండగా ఇంతలో నందు అక్కడికి వచ్చి ఇదే మంచి అవకాశం ఈ నెక్లెస్ ని తులసికి ఇవ్వాలి అనుకుంటూ ఉంటాడు.
అప్పుడు తులసి దగ్గరికి ఊరికే వెళ్తే బాగుండదు అని క్యారం బోర్డు ఆడడానికి అనుకుని అక్కడికి వెళ్తాడు నందు. అప్పుడు తులసి ఆశ్చర్యంగా నందు వైపు చూడడంతో ఏమైంది తులసి అనగా మీరు కోపంగా ఉంటేనే లేదంటే ఏదైనా అవసరం ఉంటేనే హాల్లోకి రారు కదా అనగా అదేం లేదు అని అంటాడు. నేను మారకూడదా అని అనడంతో మారాల్సిన దానికంటే ఎక్కువగా మారారని అనిపిస్తుంది అనగా నందు సిగ్గుపడుతూ ఉంటాడు. అప్పుడు నందు క్యారం బోర్డు ఆడడానికి తులసిని పిలుస్తాడు. ఇంతలోనే అక్కడికి అందరు రావడంతో నందు బిక్క మొహం వేస్తాడు.
అప్పుడు లాస్య కోప్పడకుండా శాంతంగా ఉండాలి లేదంటే నందు నెక్లెస్ నాకు ఇవ్వకుండా మనసు మార్చుకుంటాడు అనుకుంటూ ఉంటుంది. అప్పుడు అందరూ కలిసి క్యారం బోర్డు ఆడడానికి కూర్చుంటారు. అప్పుడు క్యారం బోర్డ్ ఆడుతూ ఉండగా లాస్య అందరూ కలిసి రేపు వాలెంటైన్స్ డే జరుపుకుందాము అనడంతో సరే అని అందరూ అంటారు. ఆ తర్వాత నందు మరుసటి రోజు కూడా తులసి బైక్ లో వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు నందు తింగరి తింగరిగా మాట్లాడుతూ ఉండగా తులసి సంతోషపడుతుంది. అప్పుడు సామ్రాట్ అక్కడికి రావడంతో తులసి సంతోషపడుతుండగా వీడు కూడా వచ్చాడా అనుకుంటూ ఉంటాడు నందు.
అప్పుడు నందు ఎలా వెళ్లాలి అనుకుంటూ ఉండగా అప్పుడు అప్పుడు సామ్రాట్ తులసి గారు అర్జెంట్ మీటింగ్ ఉంది కదా మర్చిపోయారు అనడంతో లేదు గుర్తు ఉంది మధ్యాహ్నం కదా అని సైలెంట్ గా ఉన్నాను అంటుంది. ఆ తర్వాత లాస్య కూడా రావడంతో అందరూ కలిసి కేఫ్ కి బయలుదేరుతారు. అప్పుడు లాస్య నెక్లెస్ నాకే ఇస్తాడు తులసి కుళ్ళుకుంటుంది అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు నందు ఏం మాట్లాడాలో తెలియక తింగరి తింగరిగా మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు ప్రేమ్ గిటార్ వాయిస్తూ ఉండగా కేఫ్ లో అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంతలో లాస్య నందు తులసి వాళ్ళు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
అప్పుడు ఒక ముసలి జంట కేఫ్ లో డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండగా అది చూసి అందరూ సంతోష పడుతూ ఉంటారు. ఈ వయసులో ఇదేంటి తాతయ్య గారు అనడంతో ప్రేమకి వయసు లేదు అని అంటారు. ఇప్పుడు వాళ్లు ప్రేమ గురించి చెప్పడంతో అందరూ క్లాప్స్ కొడుతూ సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు తులసి, ప్రేమ్ మాట్లాడుకుంటూ ఉండగా ఆ పెద్దాయన వాళ్ళు ప్రేమ గురించి బాగా చెప్పారు కదా అమ్మ అనడంతో కేవలం వినడం మాత్రమే కాదు ప్రేమ ఆచరించాలి అని అంటుంది. అదేంటమ్మా ఆడడంతో ప్రేమికుల మధ్య కాదు భార్య భర్తల మధ్య కూడా ప్రేమ ఉంటుంది వాళ్ళు కూడా వాలెంటైన్స్ డే జరుపుకోవచ్చు అంటుంది తులసి.
