Asianet News TeluguAsianet News Telugu

జూనియర్ ఎన్టీఆర్ మాటను హరికృష్ణ పట్టించుకోలేదా..?

నందమూరి కుటుంబంలోహరికృష్ణ మరణంతో కలిపి ఇప్పటికే మూడు యాక్సిడెంట్లు జరిగాయి. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ తో ప్రారంభమైన రోడ్డు ప్రమాదాల పరంపర నందమూరి హరికృష్ణ మరణం వరకు కొనసాగుతూ వచ్చాయి. 

Nandamuri Harikrishna dies in road mishap
Author
Hyderabad, First Published Aug 29, 2018, 10:48 AM IST

నందమూరి కుటుంబంలోహరికృష్ణ మరణంతో కలిపి ఇప్పటికే మూడు యాక్సిడెంట్లు జరిగాయి. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ తో ప్రారంభమైన రోడ్డు ప్రమాదాల పరంపర నందమూరి హరికృష్ణ మరణం వరకు కొనసాగుతూ వచ్చాయి. 2009 లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాలు నిర్వహించి హైదరాబాద్ కి తిరిగివచ్చే సమయంలో ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ జరిగింది. దీన్ని నుండి ఆయన సురక్షితంగా బయటపడ్డారు.

ఆ తరువాత 2014లో ఎన్టీఆర్ పెద్దన్నయ్య జానకిరామ్ హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు తేరుకోవడానికి చాలా సమయమే పట్టింది. అప్పటినుండి ఎన్టీఆర్ ఏ సినిమా ఫంక్షన్ కి వెళ్లినా.. అభిమానులను ఉద్దేశిస్తూ మా ఇంట్లో జరిగిన విషాదం మరే ఇంట్లో జరగకూడదు.. జాగ్రత్తగా మీరందరూ ఇంటికి వెళ్లండి అంటూ జాగ్రత్తలు చెప్పేవారు.

చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ ఎమోషనల్ కూడా అయ్యాడు. నందమూరి వారసుల చిత్రాలు ప్రారంభం కావడానికి ముందుగా థియేటర్లలో.. ''అతివేగం ప్రమాదకరం.. యాక్సిడెంట్ కారణంగా మేము ఇప్పటికే మా ప్రియ సోదరుడిని కోల్పోయాం. ఆ పరిస్థితి మరెవరికీ రావొద్దు'' అంటూ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. అంతగా ఎన్టీఆర్ హెచ్చరించి, జాగ్రత్తలు చెబుతున్నా హరికృష్ణ మాత్రం డ్రైవింగ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కారు నడిపి ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇలా వరుసగా కుటుంబంలో యాక్సిడెంట్లు జరగడం కుటుంబాన్ని కుంగదీస్తోంది!

హరికృష్ణ మృతి మా కుటుంబానికి తీరని లోటు...సీఎం చంద్రబాబు

హరికృష్ణకు అది సెంటిమెంట్....కానీ ఇవాళ అలా ఎందుకు వెళ్లారో మరి: హరికృష్ణ సన్నిహితుడు

ఆ విషయం ఎన్టీఆర్ తర్వాత.. హరికృష్ణకు మాత్రమే తెలుసట

హరికృష్ణ మృతి: సీటు బెల్ట్ పెట్టుకొంటే బతికేవాడు,120 కి.మీ స్పీడ్‌లో కారు

రోడ్డు ప్రమాదంలో హరిక్రిష్ణ దుర్మరణం (ఫోటోలు)

 

Follow Us:
Download App:
  • android
  • ios