బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీయార్ బయోపిక్ తో మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయమని ఓ వైపు, లేదా సోలో హీరోగానే ఉంటుందని మరోవైపు వార్తలు వస్తున్నాయి. కొన్నాళ్లుగా ఎక్కడా మోక్షజ్ఞ ఫోటో గానీ.. ఏదైనా ఫంక్షన్లో అప్పియరెన్స్ గానీ ఎక్కడా కనిపించలేదు. ఫారిన్లో చదువుతూ యాక్టింగ్ లో ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడని చెప్పేవారు. అయితే.. తాజాగా ఓ అభిమాని సోషల్ మీడియాలో షేర్ చేసిన మోక్షజ్ఞ ఫోటో చూసి.. ఫ్యాన్స్ ఆందోళనలో పడ్డట్టు ఇన్ సైడ్ టాక్.ఫిజిక్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు లేకుండా.. హీరోయిక్ క్వాలిటీ ఏ ఒక్కటీ లేకుండా ఉన్న ఈ ఫోటో నిజమే అయితే.. లేటెస్ట్ గా మోక్షు ఇలాగే ఉంటే.. సినిమాలకు కష్టమని.. అఖిల్ లానే డెబ్యూ కోసం హడావిడిగా రాంగ్ స్టెప్ తీసుకున్నట్టు అవుతుందని భయపడుతున్నారట. ఒకవేళ ఇది ఓల్డ్ ఫోటో ఐతే బాగుండునని దేవుడికి మొక్కుకుంటున్నారట! మరోవైపు.. మోక్షు లేటెస్ట్ లుక్ ను డైరెక్ట్ గా మూవీ ముహూర్తం షాట్ సమయంలోనే ఫ్యాన్స్ కు, ఇండస్ట్రీకి పరిచయం చేస్తారని ఇన్ సైడ్ టాక్.