మెగా అల్లుడి ఆడియో ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా బాలయ్య.?

First Published 23, Jun 2018, 12:49 PM IST
Nandamuri Balakrishna to attend vijetha audio release
Highlights

మెగా అల్లుడి ఆడియో ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా బాలయ్య.?

'గౌతమీపుత్ర శాతకర్ణి' ఫంక్షన్ సందర్భంగా ఒకే వేదికపైన కనిపించిన చిరంజీవి, బాలకృష్ణలు... మరోసారి స్టేజ్ ను షేర్ చేసుకోబోతున్నారని విశ్వసనీయ సమాచారం. మెగాస్టార్ చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'విజేత'. ఈ సినిమాను వారాహి సంస్థ నిర్మిస్తోంది. ఈ నెల 24న ఈ సినిమా ఆడియో ఫంక్షన్ జరగనుంది. ఈ ఫంక్షన్ కు చిరంజీవి విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. 

కాగా, బాలయ్య కూడా ఈ వేడుకకు వస్తున్నారని చెబుతున్నారు. చిరంజీవితో ఉన్న సన్నిహిత సంబంధాలు, వారాహి సంస్థతో ఉన్న అనుబంధం నేపథ్యంలో వేడుకకు వచ్చేందుకు బాలయ్య సిద్ధంగా ఉన్నారని ఫిలిం నగర్ టాక్. ఇదే జరిగితే... టాలీవుడ్ అగ్ర హీరోలిద్దరినీ మరోసారి ఒకే వేదికపై చూసే అవకాశం అభిమానులకు కలుగుతుంది.

loader