మోక్షజ్ఞ ఎంట్రీకి లైన్ క్లియర్ చేసిన బాలకృష్ణ త్వరలో నందమూరి కుటుంబం నుంచి మరో హీరో లవర్ బోయ్ గా ఎంట్రీ ఇచ్చినా మాస్ హీరోగా మారాల్సిందే అంటున్న బాలయ్య

నంద‌మూరి నటసింహం బాల‌కృష్ణ న‌ట వార‌సుడు నంద‌మూరి మోక్ష‌జ్ఞ ఈ ఏడాది సినీ రంగ ప్ర‌వేశం చేయ‌నున్నాడు. అందుకు త‌గ్గ స‌న్నాహాలు జరుగుతున్నాయి. ఈ విష‌యంపై బాల‌య్య‌ను అడిగితే అవున‌నే స‌మాధానం ఇచ్చారు.

మోక్ష‌జ్ఞ కూడా ఈ ఏడాది సినీ రంగ ప్ర‌వేశం చేస్తాడ‌ని, కెరీర్ స్టార్టింగ్‌లో ల‌వ‌ర్‌బోయ్ పాత్ర‌ల్లో క‌న‌ప‌డ‌తాడేమో కానీ, ఎక్కువ కాలం అలాంటి పాత్ర‌లు చేయ‌డానికి త‌మ అభిమానులు ఒప్పుకోర‌ని మాస్ పాత్ర‌ల్లోనే చూడాల‌నుకుంటార‌ని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేశారు బాల‌య్య‌. అంతే కాకుండా తాను, మోక్ష‌జ్ఞ క‌లిసి చేస్తే ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 సినిమాలో న‌టిస్తామ‌ని అన్నారు.