జైసింహా ఆడియో వేడుకలో డైలాగులతో ఉర్రూతలూగించిన బాలయ్య

First Published 25, Dec 2017, 2:31 AM IST
nandamuri balakrishna jaisimha movie audio event in vijayawada
Highlights
  • నందమూరి బాలకృష్ణ, కెయస్ రవికుమార్ కాంబినేషన్ లో జైసింహ
  • సంక్రాంతి కానుకగా బరిలో దిగనున్న జైసింహ చిత్రం
  • విజయవైడలో నిరివహించిన జైసింహా ఆడియో వేడుకలో బాలయ్య, నారాలోకేష్

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం జైసింహ. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా విజయవాడలో అభిమానుల మధ్య ఘనంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ వేడుక నిర్వహించారు.

 

ఈ సందర్భంగా జైసింహ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను శాసన సభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్ విడుదల చేశారు. ఇక ఆడియో వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ.. జయసింహ పేరుతో నాన్నగారు సినిమా చేశారు. నాన్నగారి స్పూర్తితో ఇప్పుడు జైసింహ అనే చిత్రాన్ని చేస్తున్నాను. ఈ చిత్రంలో అన్ని రకాల అంశాలు ఉంటాయి. సినిమాలో అద్భుతమైన సాహిత్యంతోపాటు, చిరంతన్ భట్ సంగీతం జై సింహ చిత్రానికి మంచి ప్లస్ అవుతుందని అన్నారు. భాస్కర భట్ల నాకు మరోసారి అద్భుతమైన సాహిత్యాన్ని సమకూర్చారని బాలయ్య అన్నారు.

 

ఇక తొలిసారి మంత్రిగా నా పాటల వేడుకకు నారా లోకేష్ ఇక్కడకు వచ్చాడు. యువకుడు, నేటి రాజకీయాలపై మంచి అవగాహన ఉంది. ఇంతమంచి అల్లుడు దొరకడం నాకు గర్వంగా ఉంది. తండ్రి దారిలో నడుస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి లోకేష్ కూడా కష్టపడుతున్నాడు అన్నారు.

 

ఈ సందర్భంగా దర్శకుడు కే.ఎస్.రవికుమార్‌కు తాను మంచి అభిమానిని అని.. ఎనిమిదేళ్ల నుంచి ఆయనతో పనిచేయాలని అనుకొంటున్నానని బాలయ్య అన్నారు. చివరకు అమ్మవారి దయ, పానకాల నరసింహస్వామి దయవల్ల రవికుమార్ తో కలిసి పనిచేసే అవకాశం కలిగిందన్నారు.

 

ఇక రాజధాని నిర్మాణంలో తలమునకలై ఉన్న సీఎం చంద్రబాబు తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. పరిశ్రమ అభివృద్ధికి చక్కటి ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు.  జనవరి 10న జై సింహ చిత్రం రిలీజ్ కాబోతున్నది. కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుంది. ఈ ఆడియో ఆవిష్కరణను విజయం చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు అన్నారు.

 

ఇక కార్యక్రమంలో చివరగా బాలయ్య జైసింహ సినిమా డైలాగులతో అభిమానులను అబ్బురపరిచారు. నన్ను చంపడం నీ తరం కాదురా.. అది పై వాడి ప్రాబ్లం. ఎవరిని ఉంచాలో ఎవరిని చంపాలో లెక్క అక్కడ ఉంటుంది. నీ కొడుకు నుదుటి మీద పదవి రాత లేదు. పెళ్లి గీత లేదు. ఆయుష్షు రేఖ లేదు. అక్కడ డిజైన్ చేసిన ఫిగర్.. నీ పొగరుతో రాత మారదు బే ఇలాంటి ఏన్నో డైలాగ్స్ మిమ్మల్ని అలరిస్తాయి అని అన్నారు. నీకు కొట్టడం మాత్రమే తెలుసు. నాకు పడటం తెలుసు. లేవడం తెలుసు. లేపడం తెలుసు. లేపేయడం తెలుసు. నీ తొక్కలో రౌడీయిజం అంటూ పవర్ డైలాగ్‌ను వేదికపై బాలకృష్ణ కొట్టి అభిమానులను ఉర్రూతలూగించారు. అయితే ఇలా డైలాగులు నోరు జారితే... థియేటల్ లో ఎక్జైట్మెంట్ మిస్ అవుతుందని కూడా కొందరు అభిమానులు ఫీలవుతున్నారు.

loader