తెలంగాణ ఏర్పాటయ్యాక ఆంధ్ర ప్రదేశ్ తోనే బాలకృష్ణ బంధం మరింత బలపడింది. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేగా, ఆంధ్రా నేపథ్యం వున్న కుటుంబంగా.. అక్కడనే ఎక్కువ ముడిపడి ఉండటంతో బాలయ్య ప్రస్తుతం తానుంటున్న ఇంటిని ఒక షాపింగ్ మాల్ కోసం ఇవ్వనున్నారు అనే పుకారు ఇప్పుడు మీడియా సర్కిల్స్ లో గుప్పుమంటోంది. దీనికి సరైన ఆధారాలు ఏమి లేవు కాని బాలకృష్ణ దీని పట్ల ఆసక్తిగానే ఉన్నట్టు చర్చలు జోరుగా సాగుతున్నాయి. మంచి వైశాల్యంలో ఉన్న ఇంటిని పూర్తిగా పడగొట్టి పెద్ద మాల్ ను కనక ఏర్పాటు చేస్తే స్థలం విలువతో పాటు లీజు రూపంలో మంచి మొత్తమే అందుకునే అవకాశాలు ఉన్నాయి. కాని బాలయ్య నిజంగా అలా ఒప్పుకుని ఉంటాడా లేక మీడియా కథనాల రూపంలో బయటికి వచ్చిన గాసిప్పా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.బాలయ్య ఇక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకుని దశాబ్దాలు అవుతోంది. మంచి ప్రైమ్ లొకేషన్ కావడం చంద్రబాబు ఇంటికి రెండు లైన్ల దూరంలోనే ఉండటం అన్నింటికీ అనుకూలమైన చోటు కావడం ఇవన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది నిజమని వెంటనే నమ్మలేం. ఇప్పటికే బాలయ్యకు నగరంలో పలు ఆస్తులు ఉన్నాయి. ఒకవేళ ఇది కూడా మాల్ చేయాలనుకుంటే అదేమి కష్టం కాదు. మరి కొత్త నివాసం ఎక్కడ ఏర్పరుచుకుంటారు అనే సందేహం వస్తుంది. అయినా అది పెద్ద సమస్య కానే కాదు.


 

ఫాన్స్ మాత్రం ఇది జరిగే అవకాశాలు తక్కువే అంటున్నారు. బసవతారకం కాన్సర్ ఆసుపత్రి రామకృష్ణ స్టూడియో వ్యవహారాలు ఆస్తుల నిర్వహణ సినిమా షూటింగులు ఇలా ప్రతి ఒక్కటి హైదరాబాద్ తోనే ముడిపడి ఉన్నప్పుడు ఉన్న ఇంటిని షాపింగ్ కోసం ఇచ్చేసి కొత్త ఇంటికి ఎందుకు వెళ్తారు అని ప్రశ్నిస్తున్నారు. వచ్చింది గాసిప్పే కాబట్టి దీని గురించి చర్చ జరగడం అవసరం లేదు అంటున్నారు. భుజానికి ఆపరేషన్ జరిగాక రెస్ట్ తీసుకుంటున్న బాలయ్య వచ్చే నెల నుంచి ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.