సూపర్ స్టార్ మహేష్ బాబుకి సంబంధించిన అన్ని పనులు, షూటింగ్ వ్యవహారాలు, రెమ్యునరేషన్, యూఎస్ ప్రోగ్రామ్ లు అన్నీ కూడా ఆయన భార్య నమ్రత దగ్గరుండి చూసుకుంటుంది. సినిమాలలో మాత్రమే కాకుండా మహేష్ బాబు సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నాడు. దానికి కూడా నమ్రత్ ప్లానింగే కారణమని అంటారు.

అయితే ఇప్పుడు మహేష్ బాబు ఇమేజ్ కి డ్యామేజ్ జరగడానికి కారణం కూడా ఆమె అంటూ ఆమె సన్నిహిత వర్గాల ద్వారానే తెలుస్తోంది. అసలు విషయంలోకి వస్తే ఇటీవల ఊహించని రీతిలో మహేష్ బాబు అమెరికాలో తలపెట్టిన ఫండ్ రైజింగ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. దీనికి రకరకాల కారణాలు వినిపించాయి.

నిర్వాహకులు సెక్యురిటీ కారణాల వలన ప్రోగ్రామ్ ని పోస్ట్ పోన్ చేశామని కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ అసలు కారణమేంటని ఆరా తీయగా.. నమ్రతకి ఉన్న డబ్బు పిచ్చే అని తెలుస్తోంది. అమెరికాలో మహేష్ కోసం చేపట్టిన ఈవెంట్ కి టికెట్ ధర రెండు వేల డాలర్లు పెట్టారు. అంటే ఇండియన్ కరెన్సీలో లక్షన్నరకి పైనే.. టికెట్ల ద్వారా వచ్చిన డబ్బులో సగం మొత్తాన్ని ముందే ఇచ్చేయాలని నమ్రత డిమాండ్ చేసిందట.

కానీ టికెట్ రేట్ ఎక్కువ పెట్టడంతో అభిమానులు ముందుకు రాలేదు. నమ్రత మాత్రం అంత మొత్తాన్ని ముందే ఇవ్వాలని డిమాండ్ చేయడంతో చేసేదేమీ లేక ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేశారట. ఆరు నెలల తరువాత మళ్లీ ప్రోగ్రామ్ ఉంటుందని చెబుతున్నా.. అప్పటికి పరిస్థితులు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేయడం ద్వారా అమెరికాలోనే కాకుండా ఇక్కడ కూడా మహేష్ ఇమేజ్ కి కొంత డ్యామేజ్ జరిగింది.

ఇక్కడ మరో అవమానకరమైన విషయమేమిటంటే.. మహేష్ బాబు కాకుండా విజయ్ దేవరకొండ వస్తే 2 వేల డాలర్లు పెట్టి టికెట్ కొంటామని కొంటామని నిర్వాహకులకి కొందరు చెప్పారని తెలుస్తోంది. ఈ సంగతి ఇలా ఉంటే.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున ఫండ్స్ కోసం మహేష్ బాబు అమెరికాలో ఓ ఈవెంట్ చేయమని అడిగారట.

దీనికి కూడా నమ్రత కోటి రూపాయలు డిమాండ్ చేయడం 'మా' అసోసియేషన్ వారికి షాక్ ఇచ్చిందట. సేవా కార్యక్రమం కోసం చేసే ఈవెంట్ కి నమ్రత్ రెమ్యునరేషన్ అడగడంతో ఆ ఈవెంట్ ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయాలన్నీ మహేష్ బాబుకి తెలియకుండానే జరిగి ఉంటాయా..? లేక తెలిసే జరుగుతున్నాయా..? అనే విషయంలో మాత్రం స్పష్టత రావడం లేదు. 

ఇది కూడా చదవండి.. 

మహేష్ స్థాయిని తగ్గించి ఇప్పుడు క్లారిటీ ఇస్తే ఎలా..?

మహేష్ పరువు తీయటం కాకపోతే ఎందుకీ పనులు?

మెహర్ రమేష్.. మహేష్ ని దెబ్బ కొట్టాడు,నమ్రత సీరియస్!