మహేష్ వంటి సూపర్ స్టార్ తో ఈవెంట్ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది. ఇది చాలా మంది ఈవెంట్ మేనేజర్ల కల. అయితే కొందరు దాన్ని నిజం చేస్తారు. అయితే తమ అత్యాశతో దాన్ని నాశనం కూడా చేస్తూంటారు. అలాంటిదే రీసెంట్ గా ఒక సంఘటన చోటు చేసుకుంది. మహేష్ తో అమెరికాలోని న్యూయార్క్ మహా నగరంలో ఓ ఛారెటీ షో ఒకటి ప్లాన్ చేసారు. 

అక్టోబర్ 27 న జరగనున్న ఈ షో ఆఖరి నిముషంలో కాన్సిల్ అయినట్లు సమాచారం. అందుకు కారణం ..కేవలం టిక్కెట్లు అమ్ముడవకపోవటమే. ఫండ్ రైజింగ్ డిన్నర్ ఈవెంట్ కు టిక్కెట్ ఎక్కువ రేటు పెట్టడంతో రెస్పాన్స్ లేదని తెలుస్తోంది. దాంతో కాన్సిల్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. 

అయితే ఈ విషయమై అధికారికంగా ఇంకా ఏ వార్తా రాలేదు. ఇక ఈ విషయం తెలిసిన చాలా మంది మహేష్ లాంటి సూపర్ స్టార్ తో పోగ్రాం ప్లాన్ చేసినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి...ఆయన పరువు తీయటం కాకపోతే ఎందుకీ పనులు అని విసుక్కుంటున్నారు. 

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు తాజా చిత్రం ‘మహర్షి’.  మహేష్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ఈ 25వ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు.  ఇక మహేష్‌బాబు 'మహర్షి' కోసం గడ్డం పెంచేశాడు. మొన్నటిదాకా ఆయన గడ్డం లుక్కుతోనే కనిపించాడు. ఇప్పుడు మళ్లీ వేషం మార్చేశాడు. సినిమా కోసమే అది కూడా. 'మహర్షి'లో మహేష్‌ భిన్న రకాలుగా కనిపించబోతున్నారు.  కాలేజీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో గడ్డంతోనూ... మిగతా సన్నివేశాల్లో నున్నటి మొహంతోనూ సందడి చేయబోతున్నారు. అందుకోసమే ఆయన లుక్‌ తరచుగా మారుతోంది.  

అమెరికాలో  తీసే సన్నివేశాల్లో మహేష్‌ ఓ ఐటీ కంపెనీ అధిపతిగా కనిపించనున్నట్టు సమాచారం. 'మహర్షి' వచ్చే ఉగాదికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దిల్‌రాజు, అశ్వనీదత్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.