వర్మ అర్ధంలేని ప్రకటనలు చేస్తున్నాడు.. నమ్రత ఫైర్!

First Published 21, Jul 2018, 3:17 PM IST
Namrata Dutt Lashes Out At Ram Gopal Varma For Making Another Biopic On Sanjay Dutt
Highlights

ఒకవేళ తన అన్న జీవితంపై సినిమా చేయాలనుకుంటే ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలి గానీ ఇలా ఇష్టం వచ్చినట్లు ప్రకటనలు చేయకూడదని సూచించింది.

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ జీవితం ఆధారంగా 'సంజు' అనే బయోపిక్ రూపొందించిన సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ నటించిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఇప్పటికీ థియేటర్లలో కలెక్షన్ల పరంగా ఈ సినిమా తన సత్తా చాటుతూనే ఉంది.

అయితే ఈ సినిమా సంజయ్ దత్ ఇమేజ్ మేకోవర్ కోసమే తీశారని కొంతమంది వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ  అండర్ వరల్డ్ తో దత్ కు ఉన్న సంబంధాల గురించి సినిమా తీస్తానని ప్రకటించారు. వర్మ ఇలా ప్రకటన చేయడంతో సంజయ్ దత్ చెల్లెలు నమ్రతదత్ ఫైర్ అయింది. వర్మ ఇలాంటి అర్ధంలేని ప్రకటనలు ఎలా చేస్తాడు అంటూ అసహనం వ్యక్తం చేసింది.

ఒకవేళ తన అన్న జీవితంపై సినిమా చేయాలనుకుంటే ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలి గానీ ఇలా ఇష్టం వచ్చినట్లు ప్రకటనలు చేయకూడదని సూచించింది. ప్రతి విషయంపై ఘాటుగా తనదైన స్టైల్ లో స్పందించిన వర్మ మరి నమ్రత చేసిన కామెంట్స్ పై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి!

loader