మూడు బ్రేకప్స్ తర్వాత మూడుముళ్లు.. వీరేంద్రతో నమిత

First Published 6, Dec 2017, 2:22 PM IST
namitha press meet after marriage
Highlights
  • వివాహం అనంతరం ఫస్ట్ టైమ్ మీడియాతో మాట్లాడిన నమిత
  • తన లవ్ స్టోరీ చాలా కూల్ అంటున్న నమిత
  • బిగ్ బాస్ నుంచి రాగానే వీరేంద్ర ఎమోషనల్ గా పడేశాడన్న నమిత

సౌత్ లో స్టార్ హిరోయిన్ గా వెలుగొందిన నమిత ఇటీవలే వివాహం చేసుకుంది. కొద్దికాలంగా తను ప్రేమిస్తున్న నిర్మాత, మోడల్ వీరేంద్ర చౌదరీని నమిత వివాహం చేసుకొన్న సంగతి తెలిసిందే. వీరి వివాహం నవంబర్ 24న తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం అనంతరం తొలిసారి మీడియాతో మాట్లాడిన నమిత తన వ్యక్తిగత, దాంపత్య జీవిత విషయాలను వెల్లడించింది.

 

తమప్రేమ కథలో పెద్దగా ట్విస్ట్ లు టర్న్ లూ ఏమీ లేవని నమిత పేర్కొంది. మా ప్రేమ కథ చాలా సింపుల్. ఎలాంటి ట్విస్టులు లేవు. శశి అనే కామన్ ఫ్రెండ్ ద్వారా వీరేంద్ర నాకు పరిచయం అయ్యాడు. ఆధ్యాత్మికం, రాజకీయాలను వీరేంద్ర బాగా విశ్లేషిస్తాడు. దాంతో మా మధ్య వేవ్ లెంగ్త్ పెరిగింది. వీరేంద్ర మంచితనం నన్ను ఆకట్టుకొన్నది. వెంటనే స్నేహితులమయ్యాం. తరచు కలుసుకొనే వాళ్లం. నాకు చాలా చక్కటి సలహాలు, సూచనలు ఇచ్చేవాడు. మా స్నేహం బలపడుతున్న సమయంలోనే నాకు తమిళ బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. బిగ్‌బాస్‌కు వెళ్లమని అతనే ప్రోత్సాహించాడు. బిగ్‌బాస్ షో సమయంలో నేను ఎప్పుడూ నా కుటుంబానికి దూరంగా ఉండలేదు. బిగ్‌బాస్‌లో పాల్గొనడమంటే చాలా రోజులు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. దాంతో భయపడ్డాను. కానీ వీరేంద్ర ధైర్యం చెప్పి నా కుటుంబాన్ని గురించి చూసుకొంటాను అని ధైర్యం ఇచ్చాడు. దాంతో బిగ్‌బాస్‌కు ఓకే చెప్పాను.

 

బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన రోజు రాత్రి నాకు ప్రపోజ్ చేశాడు. నిన్ను ప్రేమిస్తున్నాను అని వీరేంద్ర చెప్పగానే చాలా ఉద్వేగానికి లోనయ్యాను. వీరేంద్రను నేను తొలిసారి 2016 సెప్టెంబర్ 6న కలిశాను. ఆ తర్వాత ఏడాది అనంతరం నాతో పెళ్లి చేసుకొందామా అని అడిగారు. దాంతో పెళ్లి కల సాకారమైంది. అతడితో జీవితం ఓ చక్కటి ప్రయాణంలా ఉంది. వీరేంద్ర చాలా విషయాలపై పట్టు ఉంది.

 

పెళ్లి తర్వాత నాకు పెద్దగా మార్పులు కనిపించలేదు. మెడలో మంగళసూత్రం, కాళ్లకు మెట్టెలు వచ్చాయి. అంతకు మంచి జీవితంలో మార్పు ఏమీ జరగలేదు. అత్తామామల నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు. కుంకుమ పెట్టుకో, చీర కట్టుకో అని నా భర్త, అత్తామామలు ఎలాంటి నిబంధనలు పెట్టలేదు.

 

నా జీవితంలో నాకు మూడు బ్రేకప్స్ ఉన్నాయి. వాటి అనుభవంతో జీవితంలో ఎలాంటి వ్యక్తిని ఎంచుకోవాలనే విషయం తెలిసింది. వీరేంద్ర పెళ్లి చేసుకుంటావా అని అడిగినప్పుడు ఆయన ప్రపోజల్‌ను తిరస్కరించడానికి ఒక్క కారణం కూడా కనిపించలేదు. ఒకవేళ ఆయన ప్రపోజ్‌ చేయకపోయి ఉంటే.. నన్ను పెళ్లి చేసుకుంటావా? అని నేనే అడిగేదాన్ని' అంటూ నమిత చెప్పింది.

loader