గత కొంత కాలంగా ఆయన చిత్రాల్లో ఆ మ్యాజిక్ కనిపించడం లేదు. అప్పటి వరకు కృష్ణ వంశీ సినిమాలో ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు అని  ఎదురు చూసిన నటీనటులు సైతం ఈ నక్షత్రం  సినిమాతో తమ అభిప్రాయాలను మార్చుకుంటున్నారు. కృష్ణ వంశీ అభిమానులంతా.. ఏమైంది ఆయనకు అని చర్చించుకుంటున్నారు.

ఒకప్పుడు కృష్ణ వంశీ సినిమా అంటే చాలు.. అందులో హీరో ఎవరు.. హీరోయిన్ ఎవరు అని ఆలోచించకుండా.. కేవలం ఆయన కోసమే థియేటర్ కి వెళ్లిన వారు చాలా మంది ఉన్నారు. ఆయన సినిమాలో ఏదో మ్యాజిక్ కనిపించేంది. కానీ గత కొంత కాలంగా ఆయన చిత్రాల్లో ఆ మ్యాజిక్ కనిపించడం లేదు. సరికదా.. బాబోయ్ ఏంటి ఈ సినిమా అనే లెవల్ కి దిగజారిపోయాయి. అందుకు నిదర్శణమే ఇటీవల విడుదలైన ‘నక్షత్రం’ సినిమా.

అప్పటి వరకు కృష్ణ వంశీ సినిమాలో ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు అని ఎదురు చూసిన నటీనటులు సైతం ఈ నక్షత్రం సినిమాతో తమ అభిప్రాయాలను మార్చుకుంటున్నారు. ఆయన తదుపరి సినిమాలో నటించమని తమను అడగకపోతే చాలు అని భావిస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.అంతలా విసుగు తెప్పించింది నక్షత్రం సినిమా.

కలెక్షన్ల విషయంలోనూ అంతే నిరాశ కనపడుతోంది. దాదాపు రూ.22కోట్లు పెట్టుబడితో విడుదలైన ఈ చిత్రం కనీసం పెట్టుబడులు కూడా రాబట్టలేదు. సినిమా మొత్తం కలెక్షన్లు వచ్చి.. రూ.4.16కోట్లు మాత్రమే. ఓవర్సీస్ మార్కెట్ లో రూ.3లక్షలు మాత్రమే రాబట్టిదంటే అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ రూ.3కోట్లకు అమ్ముడు పోవడం మాత్రమే నిర్మాతలకు కాస్త ఊరట కలిగించిన విషయం. 

ఇవన్నీ చూసి కృష్ణ వంశీ అభిమానులంతా.. ఏమైంది ఆయనకు అని చర్చించుకుంటున్నారు.