ఇంతలా దిగజారి పోతారా.. సినిమా చూశాక ఏంచేస్తానో చెప్తా: నగ్మా

First Published 23, Nov 2017, 2:33 PM IST
nagma name in julie2 movie story controversy
Highlights
  • జూలీ2 సినిమా కథ నైంటీస్ లో ఊపేసిన దక్షిణాది హిరోయిన్ దట
  • సినిమా మేకర్స్ చెప్తున్నదాన్ని బట్టి అది నగ్మా కథేననే అనుమానాలు
  • తన గురించి తప్పుగా చూపిస్తే... న్యాయ పోరాటం చేస్తానన్న నగ్మా

 

సౌత్ సెక్సీ బ్యూటీ ల‌క్ష్మీరాయ్ బాలీవుడ్ లో నిలదొక్కుకునే ప్రయత్నంలో భాగంగా అత్యంత బోల్డ్‌ గా న‌టించిన జూలీ2 సినిమా విడుద‌ల‌కు ముందే మంచి హైప్ సాధించింది. బాలీవుడ్ తొలి ప్రయత్నంలోనే తన సెక్సీ అందాలకు బాగా సూటయ్యే సినిమాను ఎంచుకున్న లక్ష్మీరాయ్ ప్రేక్షకులు ఇప్పటి వరకు ఊహించని బోల్డ్ అవతారంలో కనిపించబోతోంది.

 

'జూలి'కి సీక్వెల్ గా గతంలో నేహ ధూపియా ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన‌ 'జూలి'కి సీక్వెల్ గా తెర‌కెక్కుతున్న 'జూలీ 2' చిత్రాన్ని శివ‌దాసాని రూపొందిస్తున్నాడు. నవంబర్ 24న సినిమా విడుదల కాబోతోంది. మాజీ సెన్సార్ బోర్డ్ చైర్మన్ పహ్లాజ్ నిహ్లాని ఇప్పుడు ఈ చిత్ర సమర్పకుడు పహ్లాజ్ నిహ్లాని మీడియా ముందుకొచ్చి ఓ ఆసక్తికర విషయం చెప్పాడు. ఈ చిత్రం ఓ మాజీ హీరోయిన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా అని చెప్పాడు. ఆమె పేరు బయటపెడితే.. తమకు లీగల్ సమస్యలు తప్పవని.. సినిమా విడుదల కూడా ఆగిపోవచ్చని ఆయనన్నాడు. అందుకే ఆ నటి పేరు చెప్పబోమన్నాడు.

 

పహ్లాజ్ చెప్పిన పాయింట్లన్నీ కలిపి చూసినవాళ్ళంతా ఆ కథ ఒకప్పటి గ్లామర్ హీరోయిన్ నగ్మా అనే అనుకుంటున్నారు. అసలు అలా అనుకోవాలన్నదే పహ్లజ్ ఉద్దేశ్యమేమో అన్నది కూడా ఒక టాక్ . "1990-2000 మధ్య కాలంలో సౌత్ ను ఓ ఊపు ఊపిన హీరోయిన్ కెరీర్ ఆధారంగా ఈ సినిమాను నిర్మించాం. సౌత్ లో పెళ్లయిన ఓ సూపర్ స్టార్ తో ఆమె ఎఫైర్ పెట్టుకుంది. ఆ వివరాలతో పాటు సౌత్ నుంచి ఆమెను ఎలా బయటకు పంపించారు. తర్వాత ఆమె భోజ్ పురిలో ఎలా స్టార్ అయి మళ్లీ నిలదొక్కుకుంది లాంటి అంశాలు ఈ సినిమాలో ఉంటాయి." అని జూలీ-2 సమర్పకుడు పహ్లాజ్ నిహ్లానీ స్వయంగా చెబుతున్నాడు.

 

ఆయన నగ్మా పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ఆ కథ నగ్మాదే అంటూ ఒక టాక్ బయల్దేరింది. ఈ సినిమా ద‌క్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఓ తారామ‌ణి క‌థ అని ప్ర‌క‌టించాడు. అయితే ఆమె పేరు వెల్ల‌డించ‌లేదు. అయినా ప‌హ్లాజ్ ప‌రోక్షంగా మాట్లాడింది న‌గ్మా గురించే అని క‌థ‌నాలు మొద‌ల‌య్యాయి.

 

దీంతో ఈ వివాదంపై న‌గ్మా మాట్లాడింది. "ఇప్పుడు ఏమి చేయాలో తెలియ‌డం లేదు. ఇంత‌లా దిగ‌జారిపోతార‌ని అనుకోలేదు. ప‌బ్లిసిటీ కోసం చెబుతున్నారో, సినిమాలో నా పై ఏమైనా ఉందో చూడాలి. సినిమా విడుద‌ల‌య్యాక చూసి మాట్లాడ‌తాన‌ు" అని న‌గ్మా చెప్పింది. మొత్తానికి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేసింది.

loader