Asianet News TeluguAsianet News Telugu

అఖిల్ హలో డైరెక్టర్ విక్రమ్ కు నాగార్జున వార్నింగ్

  • రాజుగారి గది చిత్రంలో మెంటలిస్ట్ పాత్రలో నాగార్జున
  • సమంత, నాగార్జున కాంబినేషన్ లో రాజుగారిగది2
  • నాగార్జున ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఓంకార్ కు క్లాస్, విక్రమ్ కు వార్నింగ్
nagarjuna warning to hello director vikram kumar

నాగార్జున‌, స‌మంత‌, శీర‌త్‌క‌పూర్ ప్ర‌ధాన తారాగ‌ణంగా పివిపి సినిమా, మాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఓక్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప్రై.లి. బేన‌ర్స్‌ పై సంయుక్తంగా ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం రాజుగారి గ‌ది2. అక్టోబ‌ర్ 13న విడుద‌ల‌వుతోంది. ఈ సంద‌ర్భంగా అక్కినేని నాగార్జున మీడియాతో ముచ్చటించారు.. ఆ విశేషాలు...

 

'రాజుగారి గది2' సినిమా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది. సిల్లీగా అనిపించదు. ఇందులో మెంటలిస్ట్‌ క్యారెక్టర్‌లో కనపడతాను. ఆత్మకు, నాకు ఉన్న హ్యుమన్‌ రిలేషన్‌ ఏంటి? అనేది సినిమాలో చూడాలి. కొత్త కథ. నాకు కాన్సెప్ట్‌ నచ్చగానే సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. కొత్త డైలాగ్స్‌, కొత్త క్యారెక్టర్‌తో కొత్తగా కనపడతాను. మలయాళం సినిమా నుండి ఇన్‌స్పిరేషన్‌ తీసుకున్నాం. మన స్టయిల్లో కథను మలుచుకున్నాం. అశ్విన్‌, వెన్నెలకిషోర్‌, షకలక శంకర్‌ కామెడీ ట్రాక్‌ చాలా బాగా నవ్విస్తుంది.

 

సమంత క్యారెక్టర్‌ చాలా బావుంటుంది. చివరి 20 నిమిషాలు మా ఇద్దరి మధ్య డిస్కషన్‌ గ్రిప్పింగ్‌గా ఉంటుంది. మనం సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు ఓ మంచి ఫీలింగ్‌ ఎలా కలిగిందో, ఈ సినిమాకు కూడా అలాంటి ఫీలింగే కలిగింది. రావు రమేష్‌గారు సమంత తండ్రి పాత్రలో కనపడతారు.

 

మంచి మంచి క్యారెక్టర్స్‌ వెతుక్కుంటూ వస్తున్నాయి. ఊపిరి, సోగ్గాడే చిన్ని నాయనా, ఇప్పుడు రాజుగారి గది2 ఇలా మంచి మంచి సినిమాలు, పాత్రలు వస్తున్నాయి. ఓ యాక్టర్‌గా నేను చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే అన్నీ చక్కగా కుదిరితే నానితో మరో మంచి సినిమా చేస్తాను. అందులో కూడా నా క్యారెక్టర్‌ సూపర్బ్‌ గా ఉంటుంది.

 

అక్టోబర్‌ 15న హలో షూటింగ్‌ పూర్తి చేసేస్తానని దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ చెప్పారు. డిసెంబర్‌ 22న సినిమా విడుదలవుతుందని ముందే థియేటర్స్‌ కు కూడా చెప్పేసుకున్నాం. డైరెక్టర్‌ విక్రమ్‌కు ఉదయం, సాయంత్రం ఫోన్‌ చేస్తున్నాను. ఏమైందని అడుగుతున్నాను. బ్యూటీఫుల్‌ లవ్‌స్టోరీ. సినిమా చాలా బాగా వస్తుంది. ప్రియదర్శిన్‌గారి అమ్మాయి కల్యాణి ప్రియదర్శిని హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. ప్రియదర్శిన్‌గారు నాతో, అమలతో నిర్ణయం సినిమా చేశారు. ఈ మధ్య ఆయన నాకు ఫోన్‌ చేసి అమ్మాయిని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు.

 

ఇక సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేయకుండా ఆసల్యం చేస్తే దానిపై ఆసక్తి తగ్గిపోతుంది. డేట్ అనుకున్నాక ఆ సమయానికల్లా పూర్తి చేయాలని టెక్నీషియన్లకు సూచిస్తున్నా. రాజుగారి గదికి సంబంధించి ఓంకార్ కూడా బాగానే డ్రాగ్ చేశాడు. అయితే అవసమైన చోట్ల మార్పులు చేసేందుకు తగిన సమయం వుంటేనే సినిమా కరెక్ట్ గా వచ్చి హిట్ అవుతుంది. అంతేకానీ.. తీరా రిలీజ్ డేట్ వచ్చే రోజు దాకా ఎడిటింగ్ చేస్తూ కూర్చుంటే.. మార్పులు చేర్పులు చేయలేక హిట్ కావాల్సిన సినిమాలెన్నో ఫ్లాపవుతున్నాయి. ఈ విషయంలో టెక్నీషియన్స్ కాస్త ఖచ్చితంగా వుంటే బావుంటుంది.

 

హలో సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ కూడా అనుకున్నాం కాబట్టి... విక్రమ్ కూడా సమయానికి అన్ని పూర్తి చేస్తాడని అనుకుంటున్నా. ఓంకార్ విషయంలో జరిగినట్లే విక్రమ్ చేయకూడదని ముందే హెచ్చరిస్తున్నా అన్నారు నాగార్జున.

 

ఇక నాగార్జున మీసం తీసేసి కొత్త లుక్‌తో కనిపించారు. మీసం తీసేయడం వెనుక కారణం ఏంటని అడగ్గా.. ప్రత్యేకత ఏమీ లేదు. రాజు గారి గది2 సినిమాకు సంబంధం లేదు. ఈ ఏడాది సినిమా షూటింగ్‌లు లేవు. అందుకే మీసాలు తీసేశాను. అమ్మాయిలందరూ ఇష్ట పడుతున్నారు. మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి కొత్తగా ఉంది. కొత్తగా ట్రై చేయాలని ప్రయత్నించా. నాగచైతన్య, అఖిల్‌కు పోటీ కాదు అని నాగార్జున వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios